NTV Telugu Site icon

NTR: ఎన్టీఆర్ కే ఆస్కార్..?

Ntr

Ntr

NTR: ఆర్ఆర్ఆర్ .. ఆర్ఆర్ఆర్ .. ఎన్టీఆర్.. రామ్ చరణ్, రాజమౌళి.. ఆస్కార్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇదే చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై పలు అవార్డుల్ని దక్కించుకుంటూ వస్తున్న ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సాధిస్తుందా..? లేదా..? అనేది ఉత్కంఠగా మారింది. ఇకపోతే బెస్ట్ యాక్టర్ గా ఎన్టీఆర్ ఆస్కార్ అందుకుంటాడని అభిమానులు బల్లగుద్ధి చెప్పుకొస్తున్నారు. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటన అద్భుతం. ఆ పాత్రలో మరే ఇతర హీరోను ఉహించుకోలేమని తెలుగు ప్రేక్షకులు తేల్చేశారు.

ఇక మరోపక్క బాలీవుడ్, హాలీవుడ్ డైరెక్టర్స్ ఎన్టీఆర్ నటనను పొగుడుతూ ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో ఆస్కార్ ఖచ్చితంగా ఎన్టీఆర్ కే వస్తుందని చెప్పుకొస్తున్నారు. ఆస్కార్ నామినేషన్స్ లో ఆర్ఆర్ఆర్ ఏ కేటగిరిలో ఉన్నా లేకపోయినా బెస్ట్ యాక్టర్ కేటగిరిలో ఖచ్చితంగా ఎన్టీఆర్ పేరు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెట్టింట ఎన్టీఆర్ హ్యాష్ ట్యాగ్ తో జోరుగా ప్రచారం చేస్తుండటం వైరల్ గా మారింది. #NTRForOscars #RRRForOscars అనే హ్యాష్ ట్యాగ్ లు ట్విట్టర్ ట్రెండింగ్ లో ఉన్నాయి. మరి అభిమానుల కోరిక తీరనుందా..? ఎన్టీఆర్ ఆస్కార్స్ లో ఉంటాడా..? లేదా ..? అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.