యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో #NTRForOscars అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫాన్స్ అంతా యాక్టివ్ మోడ్ లోకి వచ్చి ట్వీట్స్ వేస్తుండడంతో ట్విట్టర్ అంతా ఎన్టీఆర్ పేరు మారుమొగిపోతోంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీముడిగా ఎన్టీఆర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. గోండు బెబ్బులి పాత్రలో ఎన్టీఆర్ నిజంగా తెరపై పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తన యాక్టింగ్ స్కిల్స్ తో సినిమాని మరోస్థాయికి తీసుకోని వెళ్లిన ఎన్టీఆర్, ఆర్ ఆర్ ఆర్ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చిన కొమురం భీముడో సాంగ్ లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ సినిమా పుస్తకంలో గోల్డెన్ లెటర్స్ లో లిఖించదగ్గవి. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇంటర్వెల్ లో ఎన్టీఆర్ ట్రాక్ లో నుంచి జంప్ చేసే సీన్ వెస్ట్రన్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించింది.
దాదాపు వెస్ట్రన్ ఆడియన్స్ అందరికీ ఫేవరేట్ సీన్ అయిన ట్రక్ సీన్ ఎన్టీఆర్ కి ఇంటర్నేషనల్ క్రేజ్ తెచ్చింది. మార్వెల్ లో ఎన్టీఆర్ నటిస్తాడా? అనే ప్రశ్న వినిపిస్తుంది అంటే ఆర్ ఆర్ ఆర్ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ తో ఎన్టీఆర్ వెస్ట్రన్ ఆడియన్స్ ని ఎంతగా మెప్పించాడో అర్ధం చేసుకోవచ్చు. ఆస్కార్ బెస్ట్ యాక్టర్ ప్రాబబుల్స్ లో ఎన్టీఆర్ టాప్ ప్లేస్ లో ఉంటాడు, అతను తప్పకుండా నామినేట్ అవుతాడు, బెస్ట్ యాక్టర్ గా ఆస్కార్ అవార్డ్ తీసుకోవడానికి ఎన్టీఆర్ అర్హుడు అంటూ అన్ని మేజర్ మ్యాగజైన్స్ ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తున్నాయి. ఇంతటి రీచ్ ఒక ఇండియన్ యాక్టర్ కి దక్కడం గొప్ప విషయమే. ఎన్టీఆర్ ఆస్కార్ బెస్ట్ యాక్టర్ గా నామినేట్ అవుతాడా? లేక ఆస్కార్ గెలుస్తాడా అనేది పక్కన పెడితే ఒక ఇండియన్ యాక్టర్ ని ఇలాంటి రీచ్ రావడమే గొప్ప విషయం. అందుకే ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో #NTRForOscars హాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు.
