గతేడాది రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్ మూవీతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ రీచ్ సాధించాడు. జేమ్స్ గన్ లాంటి హాలీవుడ్ డైరెక్టర్ కూడా ఎన్టీఆర్ తో వర్క్ చెయ్యాలని ఉంది అని ఓపెన్ గా చెప్పాడు అంటే ఎన్టీఆర్ కి ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎలాంటి ఇమేజ్ ని తెచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. ఆర్ ఆర్ ఆర్ ఇచ్చిన జోష్ తో కొరటాల శివతో కలిసి ‘ఎన్టీఆర్ 30’ సినిమాని కూడా పాన్ ఇండియా రెంజులోనే చేస్తున్నాడు ఎన్టీఆర్. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఎన్టీఆర్ 30 సినిమా రిలీజ్ అవ్వనుంది. అంటే ఎ ఇయర్ ఎన్టీఆర్ నుంచి సినిమా లేనట్లే. ఈ లోటుని తీర్చడానికి మే నెల వచ్చేసింది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే, ఈరోజున ఎన్టీఆర్ చెయ్యబోయే అన్ని సినిమాల గురించి అనౌన్స్మెంట్ లు వచ్చేస్తాయి. మే 20కి ఇంకా టైమ్ ఉన్నా నందమూరి ఫాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఇప్పటి నుంచే హంగామా మొదలు పెట్టేసారు. ‘ఎన్టీఆర్ బర్త్ డే మంత్’ అంటూ ట్వీట్స్ చేస్తూ #NTR30 #ManofMassesNTR అనే టాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు. దాదాపు మే నెల అంతా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫాన్స్ హంగామా కొనసాగుతూనే ఉంటుంది.
ఈ క్రమంలో అసలు మే 20కి ఎన్టీఆర్ ఫాన్స్ కి కిక్ ఇచ్చే విషయాలు ఏమేమి బయటకి రాబోతున్నాయో ఒకసారి చూస్తే… ముందుగా సింహాద్రి, ఆది సినిమాల రీరిలీజ్‌తో ఫాన్స్ రచ్చ చేయడానికి రెడీ అయ్యారు. ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్‌గా ఎన్టీఆర్ 30 నుంచి ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా నుంచి ఒక పోస్టర్ బయటకి రావడం గ్యారెంటీ. వార్ 2కి సంబంధించిన అప్డేట్ ని కూడా యష్ రాజ్ ఫిల్మ్స్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న మాట. ఈ మూడు అప్డేట్స్ తో ఎన్టీఆర్ బర్త్ సెలబ్రేషన్స్ పీక్ స్టేజ్ కి వెళ్లిపోవడం గ్యారెంటీ. మరి ఈ కిక్ ని మరింత పెంచుతూ వెట్రిమారన్-ఎన్టీఆర్ సినిమా నుంచి కూడా ఒక అప్డేట్ బయటకి వస్తే సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోవడం ఖాయం.