WAR 2 Trailer : ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బ.. ట్రైలర్ లో సమన్యాయం..
- యాక్షన్ సీన్స్ లో ఎన్టీఆర్ అదుర్స్
- ఇద్దరి పాత్రలకు సమాన ప్రాధాన్యత
- టీమ్ జాగ్రత్త పడిందా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WAR 2 Trailer : జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న మల్టీస్టారర్ వార్-2 ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఆగస్టు 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పాత్రలకు సమాన న్యాయం దక్కినట్టు కనిపిస్తోంది. ఇందులో ఎన్టీఆర్ ను హృతిక్ రోషన్ పాత్రకు సమానంగా యాక్షన్ సీన్లు ఇచ్చేశారు. ఎవరిని ఎక్కువ చేయకుండా.. ఎవరినీ తక్కువ చేయకుండా ఇందులో ఇద్దరినీ సమానంగా చూపించిన విధానినికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆ మధ్య ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్ గా వచ్చిన టీజర్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయ్యారు. ఈ టీజర్ పై ట్రోల్స్ స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్ ను కావాలనే తక్కువ చేసి చూపించారంటూ నానా రచ్చ చేశారు. అయాన్ ముఖర్జీ, హృతిక్ రోషన్, యష్ రాజ్ ఫిలిమ్స్ ను సోషల్ మీడియాలో ఏకి పారేశారు.
Read Also : Puri-Sethupathi : పూరీసేతుపతి సెట్స్ లో మక్కల్ సెల్వన్..
Also Read
- Pavala Shyamala: శ్యామల ఎలా 'పావలా శ్యామల' అయ్యారు? చాలా మందికి తెలియని నిజం!
- Tollywood: వరుస గాయాలతో రెస్ట్ మోడ్ లోకి టాలీవుడ్ హీరోలు!
- Allu Arjun: అభిమానుల కోసం బన్నీ స్పెషల్ గిఫ్ట్.. 900 మందికి ఊహించని సర్ప్రైజ్!
- MM Keeravani: బాబు సినిమా కోసం ఇంత టైమ్ ఎందుకు స్వామి?.. 'వారణాసి' రీ రికార్డింగ్‌పై కీరవాణి కీలక నిర్ణయం!
దాంతో మూవీ టీజర్ కు ఎన్టీఆర్ టీజర్లకు వచ్చేంత ఆదరణ రాలేదు. ఆ ఎఫెక్ట్ ట్రైలర్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ ను ఏ మాత్రం తక్కువ చేయకుండా ట్రైలర్ లో చూపించారు. ఒక రకంగా చెప్పాలంటే హృతిక్ రోషన్ పాత్ర కంటే ఎన్టీఆర్ పాత్రకు ఎక్కువ స్పేస్ ఇచ్చారు. ఇది ఆయన ఫ్యాన్స్ ను సంతృప్తి పరుస్తోంది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఇలాంటి పాత్రలో కనిపించలేదు. ఇందులో ఆయన లుక్స్, యాక్షన్ లో ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇది చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇందులో ఇద్దరూ సోల్జర్స్ అని.. ఇది వార్ అంటూ అశుతోష్ రానా చెప్పిన డైలాగ్ ను బట్టి ఇద్దరి పాత్రలు సమానంగానే ఉంటాయనే హింట్ అయితే ఇచ్చారు. మొత్తానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎఫెక్ట్ మూవీ ట్రైలర్ పై బాగానే కనిపిస్తోంది. ఇదే ఇంపార్టెన్స్ థియేటర్లలో కనిపిస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అంతకు మించి ఇంకేం కావాలి అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ మూవీ ఆగస్టు 14న రజినీకాంత్ కూలీ సినిమాతో పోటీ పడుతోంది.
Read Also : WAR 2 Trailer Review : అదిరిన విజువల్స్.. యాక్షన్ సీన్స్ సూపర్బ్..
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్‌కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!