NTV Telugu Site icon

NTR 30: జనవరి 1న చెప్పారు… ఫిబ్రవరి 1 వచ్చింది… ఒక్క అప్డేట్ ఇవ్వండి సర్

Ntr 30

Ntr 30

ట్విట్టర్ ని నందమూరి అభిమానులు కబ్జా చేసి ఎన్టీఆర్ 30 సినిమా అప్డేట్ ఎప్పుడు ఇస్తారు అంటూ మేకర్స్ ని ట్యాగ్ చేసి బ్యాక్ టు బ్యాక్ ట్వీట్స్ వేస్తున్నారు. దీంతో #NTR30 ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ 30 మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి ఫెస్టివల్ విషేస్ పోస్టర్స్ ని తప్ప మేకర్స్ నుంచి ఇంకో అనౌన్స్మెంట్ రావట్లేదు. దీంతో నందమూరి అభిమానులు అసలు ఈ మూవీ అప్డేట్ ఇస్తారా ఇవ్వరా అనే రేంజులో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ 30 మూవీ గురించి మేకర్స్ నుంచి అఫీషియల్ గా ఒక అప్డేట్ వచ్చి సరిగ్గా నెల రోజులు అవుతోంది. ఫిబ్రవరిలో షూటింగ్ కి వెళ్తున్నాం, ఏప్రిల్ 5న ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తాం అంటూ మేకర్స్ జనవరి 1న ఒక ట్వీట్ చేశారు.

Read Also: Amigos: ‘ఎన్నో రాత్రులు’ వచ్చేది ఈరోజు సాయంత్రమే…

జనవరి పోయి ఇప్పుడు ఫిబ్రవరి 1 వచ్చేసింది, అయినా మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. మేకర్స్ చెప్పిన దాని ప్రకారం ఎన్టీఆర్ 30 సినిమా ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వాలి. ఫిబ్రవరి నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ అంటే జనవరి నెలలో పూజా కార్యక్రమాలు జరుపుకోవాలి. జనవరి అయిపొయింది కానీ ఎన్టీఆర్ 30 సినిమా పూజా కార్యక్రమాలు మాత్రం జరగలేదు. జనవరి 22న ఎన్టీఆర్ 30 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరుగుతుందని అంతా భావించారు కానీ తారకరత్న క్రిటికల్ కండీషన్ లో ఉండడంతో అది ఆగిపోయిందని అనుకుంటున్నారు. పోనీ ఫిబ్రవరిలో అయినా ఎన్టీఆర్ 30 సినిమా పూజా కార్యక్రమాలు చేస్తారా? రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తారా? లేక మార్చ్ నెలకి వాయిదా వేస్తారా అనేది సమాధానం తెలియాలి బేతాళ ప్రశ్నగానే మిగిలింది. ఈ బేతాళ ప్రశ్నకి ఏ విక్రమార్కుడు వచ్చి సమాధానం చెప్పాలో దేవుడికే తెలియాలి.

Show comments