JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫారిన్ టూర్ లో బిజీగా ఉన్నాడు. త్రిబుల్ ఆర్ కాన్సర్ట్ కోసం రాజమౌళి, రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ లండన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. నిన్న అట్టహాసంగా ఈవెంట్ నిర్వహించారు. అయితే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ను, రామ్ చరణ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వచ్చారు. ఈ వేడుకలో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి పాట పాడుతూ అలరించేశారు. ఫ్యాన్స్ ను సంతృప్తి పరిచేందుకు చరణ్, ఎన్టీఆర్ వారితో సెల్ఫీలు కూడా దిగారు. అయితే వేడుక అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ హాల్ బయటకు వచ్చాడు.
Read Also : Anurag Kashyap : విజయ్ సేతపతి వల్లే నా కూతురు వివాహం చేశా.. స్టార్ డైరెక్టర్ కామెంట్స్
ఎన్టీఆర్ ను చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దీంతో ఎన్టీఆర్ వారి మధ్య ఇబ్బంది పడ్డాడు. కొంత అసహనానికి గురయ్యాడు. వారిని దారి ఇవ్వాలంటూ ఎంతగా చెప్పినా వినిపించుకోకపోవంతో తిరిగి వెనక్కు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ మూవీతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. మొన్ననే కర్ణాటకలో ఓ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది. త్వరలోనే మరో భారీ షెడ్యూల్ ఉండబోతోంది. దాని కోసం ఎన్టీఆర్ రెడీ అవుతున్నాడు.
Read Also : Ram Charan : చరణ్ మైనపు విగ్రహంతో చిరంజీవి ఫ్యామిలీ..
