ఎన్టీఆర్ లైనప్ లో ఉన్న చిత్రాల్లో డ్రాగన్ ఒకటి. కేజీఎఫ్, సలార్ వంటి చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వస్తుండటం విశేషం. అంత్యంత భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తుండగా. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది 25 జూన్ 2025 న విడుదల చేయాలని నిర్ణయించారు.
Also Read : OG : ‘ఓజి’లో అకిరా.. నిజమేనా?
అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ కోసం మేకర్స్ ప్రత్యేకంగా రెండు వేరే హీరోలను ఆలోచనలో పెట్టారు. హిందీ వెర్షన్‌లో ఓ ప్రముఖ హిందీ హీరో, తమిళ వెర్షన్‌లో ఓ ప్రముఖ తమిళ హీరోని సెట్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక పోతే ఈ మూవీ ఎప్పుడో మొదలైనప్పటికి. మొదటగా 3 రోజుల పాటే షూట్ జరిగిందని తెలుస్తోంది. మొట్టమొదటిగా ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారంట. 3000 మంది ఆర్టిస్టులతో కీలక చిత్రాలను షూట్ చేశారు. తర్వాత తారక్ ‘వార్ 2’ చిత్రంతో బిజీగా ఉండటం వల్ల ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కు సమయం ఇవ్వలేక పోయారట.ప్రస్తుతం వార్ 2 విడుదలై, మిగతా కార్యక్రమాలన్నీ ముగియడంతో, ఫుల్ ఫోకస్ ఇప్పుడు డ్రాగన్ చిత్రంపైనే పెట్టారంట తారక్. అయితే ఈ ఆలస్యనికి మరొక కారణం కూడా ఉందట. ఈ చిత్రం కోసం హైదరాబాద్ లో భారీ ఇంటి సెట్‌ను నిర్మిస్తుందట ఆర్డ్ డిపార్ట్ మెంట్.ఈ సెట్ నిర్మాణ పనులు పూర్తి అవ్వగానే.. సెప్టెంబర్ మొదటి వారంలో లేదంటే 2వ వారంలో రెగ్యులర్ షూటింగ్ పునః ప్రారంభం కానుందని తెలుస్తోంది.
