NTV Telugu Site icon

JR NTR : జపాన్ లో దేవర హంగామా.. ఆ సాంగ్ కు ఎన్టీఆర్ డ్యాన్స్..

Ntr

Ntr

JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జపాన్ లో సందడి చేస్తున్నాడు. ఆయన హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన దేవర సినిమా భారీ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది. దీనికి రెండో పార్టును కూడా తీస్తామని మూవీ టీమ్ అప్పుడే క్లారిటీ ఇచ్చింది. అయితే ఎన్టీఆర్ సినిమాలకు జపాన్ లో మంచి క్రేజ్ ఉంది. గతంలో త్రిబుల్ ఆర్ సినిమా జపాన్ లో భారీ వసూళ్లు సాధించింది. ఈ క్రమంలోనే దేవర సినిమాను కూడా జపాన్ లో మార్చి 28న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా జపాన్ లో మూవీ టీమ్ ప్రమోషన్లు జోరుగా చేస్తోంది.

Read Also : Minister Satya Kumar: రాష్ట్రంలో 73 వేల క్యాన్సర్ కేసులు.. నాలుగు లక్షల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

ఇప్పటికే ఎన్టీఆర్, కొరటాల శివ జపాన్ వెళ్లారు. అక్కడ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉంటున్నారు. తాజాగా ఓ థియేటర్ లో ఎన్టీఆర్ సందడి చేశారు. అక్కడ జపాన్ అభిమానులు దేవర సినిమాలోని ఆయుధ పూజ పాటకు డ్యాన్స్ చేశారు. వారితో ఎన్టీఆర్ కూడా సరదాగా ఈ పాటకు స్టేజిమీదనే డ్యాన్స్ చేసి అలరించారు. దాంతో చప్పట్లు, అరుపులతో థియేటర్ దద్దరిల్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను దేవర మూవీ టీమ్ సోషల్ మీడియాలో పోస్టు చేయగా క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. జపాన్ లో కూడా ఈ మూవీకి భారీ క్రేజ్ ఏర్పడుతోంది.

అక్కడి మీడియా మూవీని బాగా హైలెట్ చేస్తోంది. మరి రిలీజ్ అయ్యాక అక్కడ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో చేస్తున్న మూవీ షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు. అటు వార్-2 షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఈ రెండింటి తర్వాత దేవర-2 ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు.