Site icon NTV Telugu

JR NTR : విజేతలకు కంగ్రాట్స్.. గద్దర్ అవార్డుల ప్రకటనపై ఎన్టీఆర్..

Ntr

Ntr

JR NTR : తెలంగాణ ప్రభుత్వం చాలా ఏళ్ల తర్వాత గద్దర్ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇందులో అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా (పుష్ప-2)కి అవార్డు దక్కింది. అలాగే ఉత్తమ చిత్రంగా కల్కి ఎంపికైంది. ఉత్తమ నటిగా నివేదా థమస్(35 ఇది చిన్న కథ కాదు) అవార్డు దక్కించుకున్నారు. వీరితో పాటు ఇతర కేటగిరీల్లో కూడా చాలా మంది అవార్డులు అందుకున్నారు. ఈ అవార్డులు దక్కించుకున్న వారికి జూనియర ఎన్టీఆర్ కంగ్రాట్స్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.

Read Also : Pawan Kalyan’s OG : ఓజీ సినిమాకి కొత్త తలనొప్పి?

‘అవార్డులు అందుకున్న వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది నంది అవార్డులు అందించడం చాలా సంతోషంగా ఉంది. దేవర చిత్రానికి ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డు గెలుచుకున్న గణేశ్ ఆచార్యకు నా అభినందనలు’ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం చాలా ఏళ్ల తర్వాత ఈ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అవార్డులు గెలుచుకున్న వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ కు గతంలో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కగా.. ఇప్పుడు గద్దర్ అవార్డును రెండో పార్టుకు అందుకున్నాడు.

Read Also : Sreeleela: ‘ఉస్తాద్’ కోసం బల్క్ డేట్స్ ఇచ్చిన శ్రీలీల

Exit mobile version