NTV Telugu Site icon

NTR: నీ గురించి ప్రపంచం మొత్తం తెలుసుకుంటుంది జక్కన్న

Ntr

Ntr

దర్శక ధీరుడు రాజమౌళికి ‘న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్’ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ లభించింది. ఆస్కార్ బరిలో నిలవడానికి చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న టైంలో ‘జక్కన్న’కి ఈ అవార్డ్ రావడం కలిసొచ్చే విషయం. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ రేస్ లో ఎక్కువ దూరం ప్రయాణించాలి అంటే ‘నేషనల్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్’ లాంటి అసోసియేషన్ నుంచి అవార్డ్స్ రావడం చాలా ముఖ్యం. ఇది ఆర్ ఆర్ ఆర్ ‘ఆస్కార్’ ప్రమోషన్స్ కి మంచి బూస్ట్ ఇస్తుంది. జక్కన్నకి అవార్డ్ రావడంతో ఇండియన్ సెలబ్రిటీస్ ట్వీట్స్ చేసి అభినందనలు తెలుపుతున్నారు.

ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ‘గోండు వీరుడి’గా కనిపించి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ కూడా రాజమౌళికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. “నీ గురించి ఇన్ని రోజులు నాకు తెలిసినది, ఇప్పడు ప్రపంచం తెలుసుకునే సమయం ఆసన్నమయ్యింది” అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ చెప్పినట్లు రాజమౌళి గురించి ప్రపంచం తెలుసుకునే సమయం వచ్చింది. ఒక ఇండియన్ సినిమా గురించి, ఒక ఇండియన్ డైరెక్టర్ గురించి వెస్ట్ కంట్రీస్ ఇంతలా మాట్లాడుకుంటున్నాయి అంటే అది రాజమౌళి సాదించిన ఘనత.

ఎన్టీఆర్ రాజమౌళిల స్నేహం ఈరోజుది కాదు, ‘స్టూడెంట్ నంబర్ 1’ నుంచి ఈ ఇద్దరూ కలిసి కెరీర్ కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్, జక్కన్నల కాంబినేషన్ లో ఇప్పటివరకూ నాలుగు సినిమాలు వస్తే, నాలుగు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. జక్కన్నకి ఎన్టీఆర్ యాక్టింగ్ పైన నమ్మకం, ఎన్టీఆర్ కి జక్కన్న మేకింగ్ పైన నమ్మకం అందుకే ఈ కాంబో అంత సక్సస్ ఫుల్ సినిమాలని ఇచ్చింది.

Show comments