Site icon NTV Telugu

ఇకపై ఆ షో చేయనంటున్న ఎన్టీఆర్ ?

Positive response from audience to Evaru Meelo Koteeswarulu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు మాత్రమే కాదు మంచి హోస్ట్ కూడా. ఇప్పటి వరకూ ఆయన చేసిన కొన్ని బుల్లితెర షోలను చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. గతంలో ‘బిగ్ బాస్‌’, ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలకు హోస్టుగా కన్పించారు ఎన్టీఆర్. ముందుగా హిందీలో ప్రసారమైన ఈ షోను గతంలోనే తెలుగు బుల్లితెరపై “ఎవరు మీలో కోటీశ్వరులు” పేరుతో ప్రసారం చేయగా నాగార్జున, చిరంజీవి హోస్టులుగా కన్పించారు. వాటికి మంచి స్పందనే వచ్చింది. తాజాగా కొంత గ్యాప్ తీసుకుని “ఎవరు మీలో కోటీశ్వరులు” అంటూ ఆ షో పేరును కాస్త అటుఇటుగా మార్చి, అదే గేమ్ ప్లాన్ తో ప్రసారం చేస్తున్నారు. దానికి ఎన్టీఆర్ హోస్ట్‌గా ఉన్నారు.

Read also : తగ్గేదే లే… రికార్డ్స్ బద్దలు కొడుతున్న “రాధేశ్యామ్”

ఈ షో ప్రారంభంలో మంచి రేటింగ్‌లతో బాగా ప్రారంభమైంది. కానీ రానురానూ ఈ షోకు రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. రేటింగ్ ను పెంచడానికి స్టార్స్ ను తీసుకొచ్చినప్పటికీ పెద్దగా ఫలితం కన్పించలేదు. ఇక ఎన్టీఆర్ ఎట్టకేలకు “ఎవరు మీలో కోటీశ్వరులు” షూటింగ్ ముగించారు. భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా తాను షోని కంటిన్యూ చేయనని మేకర్స్‌కి ఎన్టీఆర్ చెప్పినట్లు సమాచారం. దీని వెనుక కారణం ఇంకా తెలియలేదు. కానీ ఎన్టీఆర్ మాత్రం షోపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్, దేవి శ్రీ ప్రసాద్, ఎస్ఎస్ తమన్ తాజా అతిథులుగా పాల్గొన్న ఎపిసోడ్ లను త్వరలోనే ప్రసారం చేయనున్నారు.

Exit mobile version