Site icon NTV Telugu

JR NTR : నాగచైత్య రెస్టారెంట్ పై ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్స్

Jrntr

Jrntr

JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నటించిన సూపర్ హిట్ దేవర సినిమాను మార్చి 28న జపాన్ లో విడుదల చేశారు. త్రిబుల్ నుంచే ఆయనకు జపాన్ లో ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అందుకే దేవర సినిమాను కూడా జపాన్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. కొరటాల శివతో పాటు ఎన్టీఆర్ కూడా జపాన్ వెళ్లి వరసగా ప్రమోషన్లు చేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఎన్టీఆర్ మాట్లాడుతూ నాగచైతన్య రెస్టారెంట్ పై ఆసక్తికర కామెంట్లు చేశాడు.

Read Also : Singareni : కొత్తగూడెం సింగరేణి ప్రధాన ఆస్పత్రిలో విజిలెన్స్ తనిఖీలు…

‘నేను జపాన్ లో చాలా ఫుడ్స్ ఇష్టంగా తింటాను. కానీ హైదరాబాద్ లో కూడా జపాన్ ఫుడ్ తినాలని అప్పుడప్పుడు అనిపిస్తుంది. హైదరాబాద్ లో ఫుడ్ కల్చర్ వేరే విధంగా ఉంటుంది. విభిన్నమైన ఆహారాలు దొరికేది హైదరాబాద్ లోనే. అయితే అక్కడ జపాన్ ఫుడ్ కావాలంటే కచ్చితంగా షోయు రెస్టారెంట్ కు వెళ్లాలి. అది నాగచైతన్య పెట్టాడు. అతని రెస్టారెంట్ లో చాలా రకాల జపాన్ ఫుడ్స్ దొరుకుతాయి. అందులో సుషీ అనే జపనీస్ ఫుడ్ ని నేను బాగా ఇష్టపడతాను. ఆ ఫుడ్ చాలా అమేజింగ్ గా ఉంటుంది అంటూ ఎన్టీఆర్ పొగడ్తలు కురిపించాడు.

Exit mobile version