Site icon NTV Telugu

NTR – Modi : మోదీ తర్వాత రెండో స్థానంలో జూ.ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో సెన్సేషన్ !

Ntr Modi

Ntr Modi

సోషల్ మీడియా వేదికలో రోజు ఏదో ఓ చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా సినిమా, రాజకీయాలు, క్రీడలకు చెందిన స్టార్‌లపై నెటిజన్ల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి నెలా ఎక్స్ (ట్విట్టర్) సంస్థ ఎక్కువగా మాట్లాడుకున్న సెలబ్రిటీల జాబితా విడుదల చేస్తుంది. అయితే ఈ ఆగస్టు నెల వివరాలను తాజాగా ప్రకటించగా, ఎప్పటిలాగే ప్రధాని నరేంద్ర మోదీ అగ్ర స్థానంలో నిలిచారు. ఆయన దేశ ప్రధాని కావడంతో ఆయన పై జరిగిన చర్చ సహజమే. కానీ ఆశ్చర్యకరంగా రెండో స్థానాన్ని..

Also Read : Vijay Deverakonda : విజయ్ దేవరకొండపై.. ట్రోల్స్‌కి కారణం ఇదా ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దక్కించుకోవడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. గత నెలలో ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ చిత్రం ఆగస్టు 14న విడుదల కావడంతో, ఈ సినిమాకు సంబంధించి చర్చలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. దీంతో ఎన్టీఆర్ పేరు టాప్ ట్రెండ్స్‌లో నిలిచి, మోడీ తర్వాతి స్థానాన్ని అందుకున్నారు. ఇది ఆయన పాన్-ఇండియా స్థాయి క్రేజ్‌కు నిదర్శనం అని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూడవ స్థానంలో తమిళ స్టార్, టీవీకే అధినేత ఇళయదళపతి విజయ్ నిలిచారు. విజయ్ తమిళనాడులో రాజకీయ కార్యక్రమాలతో హీటెక్కిస్తుండటంతో ఆయన పై చర్చలు ఎక్కువయ్యాయి.

ఇక నాలుగో స్థానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఐదవ స్థానంలో టీమిండియా స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్, ఆరవ స్థానంలో రాహుల్ గాంధీ, ఏడవ స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నారు. అలాగే ఎనిమిదవ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, తొమ్మిదవ స్థానంలో ఎంఎస్ ధోని, పదో స్థానంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నిలిచారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ రెండో స్థానంలో నిలవడం ఆయన పాపులారిటీకి నిదర్శనమని అభిమానులు గర్వంగా చెబుతున్నారు.

Exit mobile version