Site icon NTV Telugu

NTR 30: ఎన్టీఆర్ ఫ్యాన్స్ సిద్ధం కండమ్మా.. రచ్చ మొదలైంది

Ntr 30

Ntr 30

NTR 30: ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యిన దగ్గరనుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ అడిగే ప్రశ్న ఒకటే ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు. కొరటాల శివ తో ఎన్టీఆర్ తన 30 వ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. కానీ మధ్యలో ఈ సినిమాకు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. కొరటాల దర్శకత్వం వహించిన ఆచార్య ప్లాప్ కావడంతో అతనికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దీంతో అందరి చూపు ఎన్టీఆర్ 30 మీద పడింది. ఎన్టీఆర్ తో ఎలాంటి కథను తీస్తాడో అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక ఎన్టీఆర్ అభిమానులకు మంచి సినిమా అందివ్వాలి అనేది ఒకటి.. డైరెక్టర్ గా తాను స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని కొరటాల కథను మరోసారి రాసుకున్నాడట.. అందుకోసం కొంత సమయం తీసుకోవడంతో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి లేట్ అయ్యింది.

ఇక మరోపక్క కొమరం భీమ్ కోసం బరువు పెరిగిన ఎన్టీఆర్.. ఈ సినిమా కోసం బరువు తగ్గడానికి మరికొంత సమయం తీసుకున్నాడని టాక్. వీటి మధ్యలో అసలు ఈ సినిమా వస్తుందా అన్న సందేహాలు కూడా వచ్చాయి. ఇక ఇవన్నీ పుకార్లు అన్నట్లు ఎట్టకేలకు ఎన్టీఆర్ 30 పట్టాలెక్కడానికి రెడీ అవుతోంది. ఒక్క ఫోటో.. ఒకే ఒక్క ఫోటో ఈ వార్తలను అన్ని కొట్టిపారేసి కొత్త హోప్స్ ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇచ్చేసింది. తాజాగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నట్లు మేకర్స్ అధికారికంగా ఒక ఫోటోను రిలీజ్ చేశారు. ఫైనల్ గా కొరటాల శివ తన కెమెరా మెన్, ఆర్ట్ డైరక్టర్ తో సినిమా గురించి డిస్కస్ చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ ఎన్టీఆర్ 30 అప్డేట్ ను ఇచ్చారు. ఇక ఈ ఒక్క ఫొటోతో త్వరలోనే ఎన్టీఆర్ 30 సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ విషయం తెలియడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చచేయడానికి సిద్ధం అయిపోతున్నారు. కాగా, ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఏ బ్యూటీ నటిస్తుందో మాత్రం ఇంకా తెలియలేదు. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరు కొట్టేస్తారో చూడాలి.

Exit mobile version