Site icon NTV Telugu

NTR 30: సముద్రం నిండా అతని కథలు.. రక్తంతో రాసినవి..

Ntr

Ntr

NTR 30: ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ 30. యువసుధ ఆర్ట్స్- ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రి 5 న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సముద్ర వీరుడుగా కనిపించనున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ 30 నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబందించిన కీలక అప్డేట్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మే 19 న తారక్ పుట్టినరోజు సందర్భంగా.. ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

ఇక దాంతో పాటు ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ లో సముద్రం ఒడ్డున.. రక్తంతో నిండిన కత్తులను చూపించి మరింత ఆసక్తి పెంచారు. “సముద్రం నిండా అతని కథలు.. రక్తంతో రాసినవి.. తారక్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నాం” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాకు దేవరా అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. అయితే.. టైటిల్ ను రివీల్ చేస్తారా..? లేక ఫస్ట్ లుక్ తోనే సరిపెడతారా..? అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Exit mobile version