Site icon NTV Telugu

Viswa Karthikeya: ‘ఎన్త్ అవర్’ మూవీ కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ ను ఆవిష్కరించిన కిషన్ రెడ్డి

Viswa Karthikeya

Viswa Karthikeya

G. Kishan Reddy: లేడీ లయన్ క్రియేషన్స్ పతాకం పై నిర్మిస్తున్న చిత్రం ‘ఎన్త్ అవర్’. పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశ్వ కార్తికేయ హీరో గా నటిస్తున్నాడు. విశ్వ కార్తికేయ నటించిన ”అల్లంత దూరాన, ఐ.పి.ఎల్” సినిమాలు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. యువ వ్యాపారవేత్త రాజు గుడిగుంట్ల స్వీయ దర్శకత్వంలో దీనిని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఎవ్వరు టచ్ చేయని పూర్తి విభిన్న మైన పాయింట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ ను కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ”ఈ చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు నా శుభాకాంక్షలు. ఈ మూవీ ఘన విజయం సాధించాలి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకనిర్మాత రాజు గుడిగుంట్ల, హీరో విశ్వ కార్తికేయ, లైన్ ప్రొడ్యూసర్ లంకదాసరి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాదెండ్ల సురేష్ బాబు, సినిమాటోగ్రాఫర్ శ్రీవెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version