NTV Telugu Site icon

Samnatha: న్యూడ్ సీన్స్.. సమంత మళ్లీనా..?

Priyanka

Priyanka

Samnatha:టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ లను కొట్టేసింది. ఇక ఆనతి కాలంలోనే అమ్మడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం నాగ చైతన్యతో ప్రేమ పెళ్లి.. ఆమె కెరీర్ లో పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కలకాలం కలిసి ఉండాలని అభిమానులు కోరుకున్నారు. కానీ, వారి కోరిక ఫలించలేదు. నాలుగేళ్లు కూడా నిండకుండానే ఈ జంట విడాకులు తీసుకొని విడిపోయారు. పెళ్లి కాకుండా సమంత తీసుకున్న మరో డేర్ డెసిషన్.. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో నటించడం. బాలీవుడ్ అంటేనే యాక్షన్ స్టంట్స్ అంతకు మించి రొమాన్స్. ఇందులో సామ్.. కథకు తగ్గట్టుగానే రొమాన్స్ చేసినా.. అది అక్కినేని కోడలు అనే పేరు ఉండడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.

Pushpa 2: పుష్ప ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయిందోచ్

ఇక ఈ రెండు కాకుండా విడాకులు అయిన వెంటనే ఐటెం సాంగ్ చేసి మరింత షాక్ ఇచ్చింది ఈ బ్యూటీ. అల్లు అర్జున్ సరసన ఆమె ఐటెం సాంగ్ చేయడంతో ఇక ట్రోలర్స్ నోటికి హద్దు అదుపులేకుండానే విమర్శలు వచ్చాయి. ఇలాంటి పాత్రలు చేయడానికి సిగ్గులేదా..? అక్కినేని కోడలు ఇంటి పరువు తీస్తుంది.. పెళ్లి తరువాత ఇంత బోల్డ్ గా నటించాలా..? అంటూ ఎన్నో విమర్శలను గుప్పించారు. వాటన్నింటిని సమర్థవంతంగా ఎదుర్కోని ముందుకు సాగిపోతుంది సామ్. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరో రిస్క్ తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సామ్ నటిస్తున్న చిత్రాల్లో సిటాడెల్ ఒకటి. వరుణ్ ధావన్, సామ్ జంటగా.. రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ను నిర్మిస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ సిరీస్ సిటాడెల్ కు హిందీ వెర్షన్ గా ఈ సిరీస్ రానుంది. ఇక ఒరిజినల్ సిరిస్ లో అమెరికా కోడలు ప్రియాంక చోప్రా నటించింది. ఇప్పటికే ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయ్యి భారీ అంచనాలను రేకెత్తించింది. ముఖ్యంగా ప్రియాంక న్యూడ్ సీన్స్ అయితే రచ్చ చేయడం ఖాయమంటున్నారు. ఇక ఈ ట్రైలర్ చూసినప్పటి నుంచి సామ్ అభిమానులకు ఒకటే మైండ్ లో మెదులుతుంది. సామ్ కూడా ఈ న్యూడ్ సీన్స్ లో కనిపించనుందా..? అని. అయితే న్యూడ్ కి అయితే ఓకే చెప్పలేదు కానీ, సెమి న్యూడ్ కు అయితే సామ్ సై అని చెప్పినట్లు టాక్ నడుస్తోంది. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు సామ్ ను వార్న్ చేస్తున్నారు. మళ్లీ విమర్శలు పాలు అవుతావు.. వద్దమ్మా.. ఇలాంటి రిస్క్ లు చేయకు అంటూ చెప్పుకొస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజమే ఎంత అనేది తెలియాల్సి ఉంది.

Show comments