Jawan: అక్కడ దీపికా పడుకోణె చనిపోతే… ఇక్కడ మీరు రామయ్య వస్తావయ్యా అంటూ డాన్స్ చేస్తున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ అయ్యి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. 750 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన జవాన్ హిందీలో 400 కోట్ల నెట్ కి రీచ్ అయ్యింది. సీక్వెల్ లేకుండా సోలో సినిమాతో ఈ రేర్ ఫీట్ సాధించిన రెండో సినిమాగా జవాన్ హిస్టరీ క్రియేట్ చేసింది. పఠాన్ సినిమాతో 400 కోట్ల హిందీ నెట్ కలెక్షన్స్ రాబట్టిన షారుఖ్… ఇప్పుడు జవాన్ తో హిస్టరీని సరికొత్తగా రాసాడు. జవాన్ పఠాన్ సినిమాల కన్నా ముందు బాహుబలి 2, KGF 2, గద్దర్ 2 సినిమాలు 400 కోట్ల హిందీ నెట్ లో సాధించాయి కానీ ఇవన్నీ సీక్వెల్స్ కావడంతో సినిమా అనౌన్స్మెంట్ నుంచే బజ్ ఏర్పడింది. 500 కోట్ల హిందీ నెట్ మార్క్ ని కూడా షారుఖ్ మూడో వారం ఎండ్ అయ్యే సరికి రీచ్ అవుతాడని నార్త్ ట్రేడ్ అనలిస్ట్ లు అంచనా వేస్తున్నారు. మూడు రోజుల క్రితం వీక్ డేస్ కాబట్టి జవాన్ కొంచెం స్లో అయ్యింది కానీ ఇప్పుడు మళ్లీ వీకెండ్ రావడంతో జవాన్ సినిమా అన్ని సెంటర్స్ లో సెన్సేషనల్ బుకింగ్స్ రాబడుతోంది. మండే ఎండ్ అయ్యే సమయానికి జవాన్ సినిమా 850 వరల్డ్ వైడ్ గ్రాస్ ని టచ్ చేయనుంది. ఈ రేంజ్ కలెక్షన్స్ ని ఒకే ఏడాదిలో రెండు సార్లు ఇవ్వడం షారుఖ్ ఖాన్ ని మాత్రమే చెల్లింది. ఇదిలా ఉంటే జవాన్ సినిమా నుంచి ‘రామయ్య వస్తావయ్యా’ ఎక్స్టెండెడ్ వెర్షన్ ఫుల్ వీడియో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేసారు.
అనిరుధ్ ఇచ్చిన సూపర్ ఎనర్జీ ఉన్న ఈ సాంగ్ సినిమా రిలీజ్ కన్నా ముందే చార్ట్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు వీడియో సాంగ్ లో యంగ్ షారుఖ్ అండ్ ఓల్డ్ షారుఖ్ తండ్రి కొడుకులుగా కలిసి డాన్స్ చేస్తూనే ఫ్యాన్స్ కి దీన్ని మించిన జోష్ ఇచ్చే ఎలిమెంట్ ఇంకొకటి కనిపించట్లేదు. ముఖ్యంగా విక్రమ్ రాథోర్ క్యారెక్టర్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు, తండ్రి పాత్రలో షారుఖ్ సూపర్బ్ గా మెప్పించాడు. అలాంటి క్యారెక్టర్ రామయ్యా వస్తావయ్యా సాంగ్ కి డాన్స్ చేస్తుంటే ఆడియన్స్ రిపీట్ మోడ్ లో వీడియో సాంగ్ ని చూస్తున్నారు. కొంతమంది మాత్రం అక్కడ దీపికా పడుకోణె, ప్రియమణిలు చనిపోయి మీరు ఇక్కడ రామయ్య వస్తావయ్యా అంటూ అమ్మాయిలతో కలిసి పార్టీ మోడ్ లో డాన్స్ చేస్తున్నారా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఏమో దీపికా పడుకోణె స్వర్గంలో ఉన్నట్లు… షారుఖ్ ఖాన్ రామయ్యా వస్తావయ్యా సాంగ్ కి డాన్స్ చేస్తున్నట్లు ఎడిట్ చేసి వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ కామెంట్స్ చూసిన తర్వాత రామయ్య వస్తావయ్యా వీడియో సాంగ్ చూస్తే మాత్రం ఎవరైనా సరే దీపికా తప్పకుండా గుర్తొస్తుంది.
Also Read
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
- Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
- Ak 47 : 'ఆదర్శ కుటుంబం' చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
- Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
తాజావార్తలు
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!