నోరా ఫతేహి అనే పేరు వినగానే అందరికీ ఒక ‘ఐటెం బాంబ్’ గుర్తొస్తుంది. స్పెషల్ సాంగ్స్ చెయ్యడంలో ఆరితేరిన ఈ బ్యూటీ, కెరీర్ స్టార్టింగ్ లో ఐటెం సాంగ్స్ మాత్రమే చేసి ఇప్పుడు హీరోయిన్ గా మారింది. హాట్ బాంబ్ షెల్ లా ఉండే నోరా ఫతేహి ఈ ఇయర్ వార్తల్లో ఎక్కువగా నిలిచింది. మాములుగా ఎప్పుడూ తన డాన్స్ మూవ్స్ తో, తన స్కిన్ షోతో వార్తల్లో నిలిచే నోరా ఫతేహి ఈసారి మాత్రం ఈ రెండింటికీ సంబంధం లేని విషయంలో హాట్ టాపిక్ అయ్యింది. మనీలాండరింగ్ కేసులో సుఖేష్ చంద్రశేఖర్ కు సంబంధించిన 200 కోట్ల మనీ ల్యాండరింగ్ కేసులో నార్త్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు అనే వార్త బయటకి రావడంతో, ప్రజలు ఈ కేస్ పై ఎక్కువ శ్రద్ధ పెట్టారు. సుఖేష్ చంద్ర కేసులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా ఉందని, దాదాపు 7 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆమె పేరుపై ఉన్నాయని, కొన్ని విలువైన కానుకలు ఆమెకు అందినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో ఈడీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ని విచారించారు.
ఈ విచారణలో జాక్వెలిన్ కొన్ని పేర్లు బయట పెట్టిందని, అందులో ‘నోరా’ పేరు కూడా ఉందని బీటౌన్ మీడియా కథనాలు ప్రచురించాయి. జాక్వలిన్ కారణంగానే మరో నోరా ఫతేహిని కూడా ఈడీ అధికారులు విచారించాల్సి వచ్చిందనేది బాలీవుడ్ చెప్తున్న మాట. అయితే ఈ విషయంలో నోరా ఫతేహి ఇప్పుడు రివర్స్ అయ్యింది. ‘తన పేరు కావాలనే విచారణలో తెలిపింది, అనవసరంగా తనని కేసులో ఇరికించింది’ అని నోరా ఫతేహి, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పై పరువు నష్టం దావా కేసు వేసింది. సుఖేష్ చంద్ర కేసులో తనను ఇరికించేందుకు జాక్వెలిన్ ప్రయత్నించిందని నోరా తన పిటిషన్ లో పేర్కొనింది. ఇద్దరం కూడా ఒకే ఇండస్ట్రీకి చెందడంతో తనను ఇబ్బంది కలిసించి తొక్కేసేందుకు జాక్వెలిన్ ప్రయత్నం చేస్తుంది అని నోరా ఫతేహి పిటిషన్ లో పేర్కొంది. నటిగా ఎదుగుతున్న తనను మరింత తక్కువ స్థాయికి పడిపోవాలి అనే ఆలోచనతోనే జాక్వెలిన్ ఆ విధంగా నాపై ఆరోపణలు చేసింది. జాక్వెలిన్ పై నోరా పెట్టిన కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణ డిసెంబర్ 19వ తేదీకి నిర్ణయించింది.