Site icon NTV Telugu

Nidhi Agerwal: అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈరోజు అది చూసే వాళ్లం

Nidhi Agerwal

Nidhi Agerwal

2016లో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన మున్నా మైఖేల్‌ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది నిధి అగర్వాల్. రెండేళ్ల తర్వాత నార్త్ నుంచి సౌత్ లో అడుగు పెడుతూ నాగ చైతన్య నటించిన ‘సవ్యసాచి’ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. మొదటి సినిమాలోనే క్యూట్, హాట్ లుక్స్ తో యూత్ ని అట్రాక్ట్ చేసింది నిధి అగర్వాల్. సవ్యసాచి సినిమా ఫ్లాప్ అయినా కూడా నిధి అగర్వాల్ కి తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి. ఒకే ఏడాదిలో అక్కినేని అఖిల్ తో మిస్టర్ మజ్ను, రామ్ పోతినేనితో ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఈ రెండు సినిమాల్లో నిధికి మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నిధి ఇచ్చిన గ్లామర్ ట్రీట్ కి యూత్ ఫిదా అయిపోయారు. స్వతహాగా డాన్సర్ అయిన నిధి, రామ్ పోతినేని పక్కన డాన్స్ కుమ్మేసింది. అందం, డాన్స్, కాస్త యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్న నిధి అగర్వాల్ తెలుగు నుంచి తమిళ్ లో కూడా అడుగు పెట్టింది. శింబు, జయం రవి లాంటి హీరోలతో నటించి కోలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

గుర్తింపు అయితే వస్తుంది కానీ కెరీర్ ని టర్న్ చేసే సినిమా మాత్రం రావట్లేదు. స్టార్ స్టేటస్ అందించే ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్న నిధి అగర్వాల్ కి ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటించే అవకాశం లభించింది. పవన్ కళ్యాణ్ హీరో, క్రిష్ డైరెక్టర్, పీరియాడిక్ బ్యాక్ డ్రాప్, పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్ట్… ఇలాంటి సినిమాలో తనకి నటించే అవకాశం వస్తుందని నిధి అగర్వాల్ కలలో కూడా ఊహించి ఉండదు. అయితే ఆ కల ఎప్పుడు నెరవేరుతుంది, హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఎప్పుడు ఆడియన్స్ ముందుకి వస్తుంది అనే విషయంలో ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు. ఈరోజు నిధి అగర్వాల్ పుట్టిన రోజు, అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే… హరిహర వీరమల్లు షూటింగ్ ఆగకుండా ఉంటే ఈ పాటకి ఆ సినిమా రిలీజ్ అయ్యి నిధి అగర్వాల్ కెరీర్ ని మంచి టర్నింగ్ పాయింట్ కూడా అయ్యేది కానీ అలా జరగట్లేదు. కనీసం నిధి అగర్వాల్ పుట్టిన రోజున హ్యాపీ బర్త్ డే అని ఒక పోస్టర్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేయలేదు అంటూ ఈ మూవీ ఎంత డైలమాలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Exit mobile version