Site icon NTV Telugu

Mahesh Babu: మావా… మాట తప్పారుగా?

Guntur Kaaram

Guntur Kaaram

గుంటూరు కారం… ఈసారి తగ్గేదేలే అని మ్యాడ్ సినిమా ప్రమోషన్లో గట్టిగా చెప్పాడు నిర్మాత నాగవంశీ. ఫస్ట్ సింగిల్ రెడీ అయింది… ఇప్పటికే తమన్ సాంగ్ కొట్టేశాడు… దసరాకు అప్డేట్ ఇస్తామని చెప్పుకొచ్చాడు. దీంతో దసరా రోజు డబుల్ ధమాకా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మహేష్‌ బాబు ఫ్యాన్స్ కానీ ఇప్పుడు మాత్రం మాట తప్పినట్టుగానే ఉంది వ్యవహారం. ఎందుకంటే… మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇచ్చిన అప్డేట్ అలా ఉంది మరి. ‘గుంటూరు కారం’ సాంగ్ త్వరగా రిలీజ్ చేయండి అంటూ… ఓ మహేష్ బాబు అభిమాని ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్‌కి తమన్ రిప్లే ఇస్తూ… నవంబర్, డిసెంబర్, జనవరి 2024 అంతా మనదే అంటూ స్పీకర్ ఎమోజి పోస్ట్ చేసాడు. ఈ లెక్కన దసరాకు గుంటూరు కారం నుండి ఫస్ట్ సింగిల్ రావడం లేదు… ఏదైనా ఉంటే నవంబర్‌లోనే ఉంటుందని ఇండైరెక్ట్‌గా చెప్పేశాడు తమన్. దీంతో మళ్లీ మాట తప్పారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఒకవేళ దసరా రోజు ఫ్యాన్స్‌ను ఖుషి చేయడానికి… ఫలానా రోజు సాంగ్ రిలీజ్ చేస్తామని… మళ్లీ అదే మిర్చి పోస్టర్‌ను అటు ఇటు మార్చి అప్డేట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అంతే తప్ప… గుంటూరు కారం దసరాకు ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేయడం గ్యారెంటీ కానీ తమన్ చెప్పినట్టుగా.. నవంబర్ నుంచి జనవరి వరకు సోషల్ మీడియాలో గుంటూరు కారం మోత మోగి పోవడం పక్కా అని చెప్పొచ్చు. ఇకపోతే… సంక్రాంతి టార్గెట్‌గా శరవేగంగా ‘గుంటూరు కారం’ షూటింగ్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా… హారికా హాసిని క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మరి గుంటూరు కారంతోనైనా మహేష్, త్రివిక్రమ్ థియేట్రికల్ హిట్ కొడతారేమో చూడాలి.

Exit mobile version