Site icon NTV Telugu

Nivetha Thomas: హే.. నివేథా.. ఎక్కడా కనిపించడం లేదేంటి.. ?

Nivetha

Nivetha

Nivetha Thomas: న్యాచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్ మ్యాన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ నివేథా థామస్. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న నివేథా ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. తెలుగు, తమిళ్, మలయాళం భాషతో సంబంధం లేకుండా మంచి సినిమాలను ఎన్నుకొని విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశాన్ని అందుకున్న నివేథా .. ఆ తరువాత మరింత వేగాన్ని పెంచుతుంది అనుకున్నారు. కానీ, అనుకోని విధంగా.. సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. 2022లో శాకిని డాకిని సినిమానే ఆమె చివరి చిత్రం. ఆ తర్వాత ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తప్ప వెండితెరపై కనిపించింది లేదు. అయితే అందుకు కారణం ఏంటి అన్న విషయం కూడా ఎవరికీ తెలియదు.

Jyothi Rai: అబ్బా.. జగతి ఆంటీ.. హీరోయిన్లు కూడా ఈ రేంజ్ లో చూపించలేదే

కాగా అప్పట్లో నివేథా కొద్దిగా బరువు పెరగడం వలన సినిమాలుకు కొంత గ్యాప్ ఇచ్చిందని, ఆమె బరువు తగ్గి మళ్ళీ కనిపిస్తుందని పుకార్లు బయటికి వచ్చాయి. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా ఆమె తక్కువగా కనిపించడం ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది. ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉంది అన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. దీంతో నివేథా ఎక్కడ ఉన్నావు అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఈ ముద్దుగుమ్మ ఈ గ్యాప్ లో బరువు తగ్గడానికి వెళ్లిందా..? లేకపోతే వేరే పనిమీద సోషల్ మీడియాకు సినిమాలుకు గ్యాప్ ఇచ్చిందా..? అనే విషయం తెలియాల్సి ఉంది.

Exit mobile version