Site icon NTV Telugu

‘బ్లడీ మేరీ’గా నివేదా పేతురాజ్!

Bloody-Mary

ప్రముఖ కథానాయిక ప్రియమణి నటించిన తొలి ఓటీటీ మూవీ ‘భామాకలాపం’ ఈ నెల 11న ఆహాలో ప్రసారం కాబోతోంది. ఇదే సమయంలో మరో పాపులర్ హీరోయిన్ నివేదా పేతురాజ్ నటించిన తొలి ఓటీటీ మూవీ ‘బ్లడీ మేరీ’కి సంబంధించిన ప్రకటన వెలువడింది. ఈ ఓటీటీ మూవీ సైతం ఆహాలోనే త్వరలో స్ట్రీమింగ్ కాబోతోంది.

Read Also : నిజమైన జోక్… RIP అంటే అవమానకరం… : ఆర్జీవీ

నివేదా పేతురాజ్ పలు తెలుగు సినిమాలలో విభిన్నమైన పాత్రలు పోషించి, ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె తొలిసారి ‘బ్లడీ మేరీ’ ఓటీటీ మూవీలో నటించింది. ‘కార్తికేయ’ చిత్రంతో చక్కని గుర్తింపు తెచ్చుకున్న చందు మొండేటి ‘బ్లడీ మేరీ’ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. పలు సినిమాలతో పాటు, ‘కుడిఎడమైతే’ వెబ్ సీరిస్ ను నిర్మించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టి. జి. విశ్వ ప్రసాద్‌ ‘బ్లడీ మేరీ’ మూవీని నిర్మించారు. ‘చెడ్డ వాళ్లకు ఆమె మహా చెడ్డది’ అనే అర్థం వచ్చేలా ఓ పవర్ ఫుల్ కాప్షన్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్, దానిపై ఉన్న కాప్షన్ చూస్తే, నివేదా పేతురాజ్ పాత్రలోని ఇంటెన్సిటీ తెలిసిపోతుంది. తనలోని లోపాలను అధిగమించి, తనకెదురైన సమస్యలతో మేరీ ఎలా పోరాటం చేసింది, తన వారిని రక్షించుకోవడానికి ఎంత దూరమైన ఎలా వెళ్ళిందన్నదే ఈ మూవీ ప్రధానాంశమని తెలుస్తోంది.

కిరిటీ దామరాజు, రాజ్ కుమార్ కసిరెడ్డి, బ్రహ్మాజీ, అజయ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా వ్యవహరించగా, కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం సమకూర్చారు. అతి త్వరలోనే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

Exit mobile version