NTV Telugu Site icon

Nivetha Pethuraj: సీఎం కొడుకు నాకేం ఇవ్వలేదు.. నా జీవితం నాశనం చేయకండి

Nivetha

Nivetha

Nivetha Pethuraj: మెంటల్ మదిలో చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఎన్.ఆర్.ఐ. భామ నివేతా పేతురాజ్ ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక అడపాదడపా తెలుగు సినిమాల్లో కనిపిస్తున్న నివేతా.. ఫార్ములా రేస్ కార్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో సర్టిఫికెట్ అందుకుంది. అంతేకాకుండా తమిళనాడులో జరిగిన స్టేట్ లెవల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో మధురై తరపున డబుల్స్ ఆడి విన్నర్ గా నిలిచింది. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. గ్లామర్ ప్రపంచంలో ఉన్న హీరోయిన్స్ పై రూమర్స్ రావడం సహజం. అంతకుముందు ఈ ముద్దుగుమ్మపై చాలానే రూమర్స్ వచ్చాయి. అయితే ఆ రూమర్స్ పై ఆమె ఎప్పుడు స్పందించింది లేదు. కానీ, ఈసారి వచ్చిన రూమర్ ను మాత్రం ఆమె తీవ్రంగా ఖండించింది.

వివరాలలోకి వెళితే.. గత కొన్నిరోజులుగా నివేతా పేతురాజ్, తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ కు మధ్య ఏదో నడుస్తుందని వార్తలు గుప్పమన్నాయి. ఆమె కోసం ఉదయనిధి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నాడని, ఆమె కోసమే కోట్లు ఖర్చుపెట్టి కారు రేసింగ్ ను ఏర్పాటు చేసాడని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా నివేతా కోసం ఉదయనిధి ఏది చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నాడని తమిళ్ మీడియాలో పుకార్లు.. షికార్లు చేసాయి. ఇక దీంతో మనస్తాపానికి గురైన నివేతా.. తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని వేడుకుంది. ఒక పోస్ట్ ద్వారా ఈ తప్పుడు వార్తలకు చెక్ పెట్టింది.

“నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఇటీవల తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయినా కూడా నేను మౌనంగా ఉన్నాను. ఎందుకంటే దీని గురించి మాట్లాడే వ్యక్తులు.. ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నారు అనేది తెలుసుకొని మానవత్వంతో ప్రవర్తిస్తుంటారని భావించాను. కొన్ని రోజులుగా నేను, మా కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాం. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. నేను చాలా గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాను. నేను 16 సంవత్సరాల వయస్సు నుండి ఆర్థికంగా, స్వతంత్రంగా ఉన్నాను. నా కుటుంబం ఇప్పటికీ దుబాయ్‌లో నివసిస్తోంది. మేము 20 సంవత్సరాలకు పైగా దుబాయ్‌లో ఉన్నాము. సినీ పరిశ్రమలో కూడా నన్ను నటించేలా చేయాలనీ, సినిమా అవకాశాలు ఇప్పించమని ఏ నిర్మాతను, దర్శకుడిని, హీరోని ఎప్పుడూ అడగలేదు. నేను 20కి పైగా సినిమాలు చేశాను, అవన్నీ నాకు దొరికాయి. నేను ఎప్పుడు డబ్బు కోసం అత్యాశతో ఉండను.

నా గురించి ఇప్పటివరకు మాట్లాడిన సమాచారం ఏదీ నిజం కాదని నేను ధృవీకరిస్తున్నాను. మేము 2002 నుండి దుబాయ్‌లో అద్దె ఇంటిలో నివసిస్తున్నాము. అలాగే, 2013 నుండి రేసింగ్ నేర్చుకున్నాను. నిజానికి చెన్నైలో రేసులను నిర్వహించడం గురించి నాకు తెలియదు. మీరు అనుకునేట్టు నేనేం అంత ముఖ్యమైనదాన్ని కాదు. నేను చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నాను. జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్న తర్వాత ఒకమంచి స్థానంలో ఉన్నాను. మీ కుటుంబంలోని ఇతర స్త్రీలు కోరుకున్నట్లే నేను కూడా గౌరవప్రదమైన మరియు ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. జర్నలిజంలో కొంత మానవత్వం మిగిలి ఉందని, వారు నన్ను ఇలా పరువు తీయడం కొనసాగించరని నేను ఇప్పటికీ విశ్వసిస్తున్నందున నేను దీనిని చట్టబద్ధంగా తీసుకోవడం లేదు. కుటుంబం యొక్క ప్రతిష్టను పాడు చేసే ముందు మీరు అందుకున్న సమాచారాన్ని ధృవీకరించాలని మరియు మా కుటుంబాన్ని ఇకపై ఎలాంటి బాధలకు గురిచేయవద్దని నేను జర్నలిస్టులను అభ్యర్థిస్తున్నాను. నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు.. నిజాలను గ్రహించండి” అని చెప్పింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Show comments