Nitya Menon: టైటిల్ చూడగానే ఏంటి నిత్యామీనన్ పెళ్లి కాకుండానే తల్లి కాబోతునుందా..? అని నోళ్లు నొక్కుకోకండి.. ఆమె ఒక కొత్త సినిమాలో ప్రెగ్నెంట్ లేడీగా నటిస్తోందట. ఆ సినిమా నేటి నుంచి షూటింగ్ స్టార్ట్ అవ్వడంతో ప్రెగ్నెంట్ టెస్ట్ ఫోటోను పెట్టి ఇదుగో ఇలా షాక్ ఇచ్చింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హోదాలో కొనసాగనున్న ఒక స్పెషాల్ హీరోయిన్ గా నిత్యా మీనన్ కు మాత్రం ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. విభిన్నమైన కథలను ఎంచుకోవడం, గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండడం, కథలో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే చేయడం లాంటివి ఆమె వ్యక్తిత్వాన్ని తెలుపుతూ ఉంటాయి. ఇక ఛాలెంజింగ్ పాత్రలకు ఎప్పుడు ముందుండే ఈ ముద్దుగుమ్మ మరో ఛాలెంజింగ్ రోల్ కోసం రెడీ అవుతోంది.
ఇటీవలే తిరు చిత్రంతో ప్రేక్షకులను పలరించిన ఈ భామ ప్రస్తుతం ఒక బై లింగువల్ చేయనున్నదట. అందులో కథ మొత్తం నిత్యామీనన్ చుట్టూనే తిరుగుతుందని టాక్. ఇక ఈ విషయాన్నీ తెలుపుతూ నిత్యా తన సోషల్ మీడియాలో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన ఫోటో పెట్టింది. దీంతో నెటిజన్స్ తమదైన రీతిలో స్పందిస్తున్నారు. నిత్యాకు పెళ్లి అయిపోయిందా..? అని కొందరు అడుగుతుంటే.. కొత్త సినిమా అనుకుంటా అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఇంకొందరు ఇలా కాకుండా కొంచెం సినిమా డీటెయిల్స్ చెప్తూ పోస్ట్ చేస్తే ఇలాంటి అనుమానాలు రావు కదా అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే రివీల్ చేస్తుందేమో చూడాలి.