Site icon NTV Telugu

Nithiin : ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ నుంచి ఎక్స్‌ట్రా ఆర్డినరి గిఫ్ట్ అందుకున్న నితిన్..

Whatsapp Image 2023 11 29 At 2.03.48 Pm

Whatsapp Image 2023 11 29 At 2.03.48 Pm

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌..మాస్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. యంగ్ బ్యూటీ శ్రీలీల ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ లో యాంగ్రీ స్టార్ డాక్టర్ రాజశేఖర్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీని నితిన్ హోం బ్యానర్‌ శ్రేష్ఠ్‌ మూవీస్‌ పై సుధాకర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో నితిన్‌ స్మగ్లర్‌గా కనిపించనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల అయిన డేంజర్ పిల్లా మరియు బ్రష్‌ వేసుకో పాటలు మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.. డిసెంబర్ 8 న ప్రపంచవ్యాప్తం గా థియేటర్ల లో గ్రాండ్‌ గా విడుదల కానున్న ఈ నేపథ్యం లో నితిన్ టీం ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్ ధోనీ తన సైన్ చేసి ఉన్న టీ షర్ట్‌ను నితిన్‌కు బహుమతిగా అందించాడు. అంతేకాదు ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ సినిమా విజయం సాధించాలని ఆయన శుభాకాంక్షలు కూడా తెలియజేశాడు. సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌పై నితిన్ స్పందిస్తూ.. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ నుంచి ఎక్స్‌ట్రా ఆర్డినరీ బహుమతి అందింది . ఈ కానుక అందించినందుకు ధన్యవాదాలు ధోనీ సార్ లవ్‌ యూ.. అంటూ నితిన్ ట్వీట్ చేశాడు. టీషర్ట్‌ పట్టుకొని దిగిన స్టిల్‌ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతుంది..ఇదిలా ఉంటే ధోనీని నితిన్‌ ఎప్పుడు కలిశాడా అని నెటిజన్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.. నితిన్ మరోవైపు వెంకీ కుడుముల డైరెక్షన్‌ లో ఓ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలిసిందే. ఈ మూవీ ని మైత్రీ మూవీ మేకర్స్ పై నవీన్‌ యేర్నేని మరియు వై రవి శంకర్‌ సంయుక్తం గా తెరకెక్కిస్తున్నారు.. జీవీ ప్రకాశ్ కుమార్ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు..

https://x.com/actor_nithiin/status/1729730741896970313?s=20

Exit mobile version