Site icon NTV Telugu

Nithin : ఆమె షూటింగ్‌కి రావడమే పెద్ద ఛాలెంజ్‌.. శ్రీలీలపై నితిన్‌ చురకలు!

Nithin

Nithin

Nithin Intresting Comments about sree leela goes viral : టాలీవుడ్‌ యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల గురించి నితిన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నితిన్ హీరోగా నటించిన `ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్‌` మూవీ సాంగ్‌ ఈవెంట్‌ని ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించగా నితిన్‌కి శ్రీలీలతో వర్కింగ్‌ ఎక్స్ పీరియెన్స్ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. ఆమెతో వర్క్ చేయడంలో ఛాలెంజింగ్‌ పార్ట్ చెప్పాల్సిన క్రమంలో నితిన్ ఆమె డేట్స్ ఇవ్వడమే పెద్ద ఛాలెంజ్‌ అని, ఆమె షూటింగ్‌కి రావడం, దానికి తగ్గట్టుగా షూటింగ్‌ అడ్జెస్ట్ చేయడమే తమకు పెద్ద సవాల్‌గా అనిపించిందని తెలిపాడు. ఒకవేళ శ్రీలీల డేట్స్ ఇస్తే అది హాఫ్ డే డేనా, రెండు గంటలా, మూడు గంటలా అనేది ఓ ఛాలెంజ్‌ అయితే, ఆ సమయంలో ఆమె సీన్లు ఎలా తీయాలనేది దర్శకుడికి ఛాలెంజని అన్నారు. నిజానికి ఆమె ఇప్పుడు ప్రమోషన్స్ కి రావాలి, రేపు వస్తుందట.

Ronald Rose: హైదరాబాద్లో కౌంటింగ్ కేంద్రాల పరిశీలన.. కౌంటింగ్కు అంతా సిద్ధం

ఆమె వస్తుందా? రాదా? రేపు వస్తుందా రాదా అనేది తమకు పెద్ద ఛాలెంజ్‌ అంటూ నవ్వుతూనే ఆమెతో ఉన్న ఇబ్బందులు బయటపెట్టాడు నితిన్‌. నిజానికి నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో మొదట రష్మిక మందన్నా హీరోయిన్‌గా అనుకున్నారు కానీ ఆమెని తప్పించి ఇప్పుడు శ్రీలీలని తీసుకుంటున్నారట. దీనిపై ఆయన స్పందిస్తూ, శ్రీలీలతో ఈ సినిమాతో మేం అనుభవించాం అయితే వెంకీకి ఆ అనుభవం లేదు, త్వరలో ఆయన కూడా అనుభవిస్తాడు అంటూ నవ్వుతూ చెప్పడం నవ్వులు పూయించింది. ఇక శ్రీలీలతో కలిసి పనిచేయడం వండర్‌ఫుల్‌ ఎక్స్‌ పీరియెన్స్ అని, ఆమె చాలా టాలెంటెడ్ బాగా నటిస్తుందని, డాన్సులు చేస్తుందన్నారు. ఆమె స్పీడ్‌కి డాన్సులు చేసేందుకు తాను కూడా చాలా కష్టపడ్డానని పేర్కొన్న నితిన్ ఆమెని మ్యాచ్‌ చేసేందుకు బాగా వర్క్ చేయాల్సి వచ్చిందని, డాన్సులు చేయకపోతే, నితిన్‌ పని అపోయిందని అంతా అనుకుంటారని అన్నారు. ఇక శ్రీలీల డేట్స్ కోసం అందరు హీరోలు వెయిట్‌ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆమె ఏక కాలంలో ఐదారు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది.

Exit mobile version