Site icon NTV Telugu

Nithiin: మోసగాడిని రివీల్ చేయబోతున్నారు…

Nithin

Nithin

‘భీష్మ’ లాంటి కూల్ ఫన్ ఎంటర్టైనర్ సినిమాని తెలుగు ఆడియన్స్ కి ఇచ్చిన వెంకీ కుడుముల, నితిన్ కలిసి సెకండ్ కాలాబోరేషన్ కి రెడీ అయ్యారు. #VN2 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్మెంట్ సమయంలో… #VNRTrio అనే పేరుతో అనౌన్స్ చేసారు. రష్మిక కూడా నటిస్తుండడంతో ఆమె పేరు నుంచి ‘R’ని కూడా కలిపి ఈ అనౌన్స్మెంట్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఛీఫ్ గెస్ట్ గా వచ్చి మరీ ఈ మూవీని లాంచ్ చేసాడు. అయితే తర్వాత డేట్స్ అడ్జస్ట్ చేయలేక రష్మిక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో… #VNRTrio కాస్త #VN2గా మారిపోయింది. శ్రీలీల, కృతి శెట్టి పేర్లు హీరోయిన్ కేటగిరిలో వినిపిస్తున్నాయి కానీ మేకర్స్ నుంచి మాత్రం ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. లేటెస్ట్ గా మైత్రీ మూవీ మేకర్స్ VN2 ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్ ని ప్రకటించింది.

“అన్ మాస్కింగ్ ది కాన్ మాన్” అంటూ జనవరి 26న ఉదయం 11:07 నిమిషాలకి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. సిటీ బ్యాక్ డ్రాప్ ని హీరో ‘శాంటా’ గెటప్ లో బ్యాగ్ తగిలించుకోని నిలబడి ఉన్నాడు. గతంలో వదిలిన పోస్టర్ లో కూడా గన్నులు, బాణాలతో డిజైన్ చేసారు కాబట్టి వెంకీ కుడుములు… ఎంటర్టైన్మెంట్ తో పాటు కాస్త యాక్షన్ డోస్ కూడా యాడ్ చేసినట్లు ఉన్నాడు. మరి #VN2 నుంచి రానున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఉండబోతుంది? నితిన్ ఈసారైనా హిట్ కొడతాడా లేదా? నితిన్ పక్కన హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Exit mobile version