Site icon NTV Telugu

Nithin: నితిన్ కోసం ‘కేజీఎఫ్’ ఫైట్ మాస్టర్

Tammudu News

Tammudu News

Nithiin Thammudu’s major action schedule choreographed by Vikram Mor of KGF fame: ఎంసీఏ, వకీల్ సాబ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శ్రీ రామ్ వేణు ప్రస్తుతం నితిన్ హీరోగా తమ్ముడు సినిమాను రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. అయితే ప్రేక్షకుల పల్స్ తెలిసిన డైరెక్టర్ గా అన్ని కమర్షియల్ అంశాలతో తమ్ముడు చిత్రాన్ని తెరకెక్కిస్తున్న శ్రీరామ్ వేణు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. యాక్షన్ డ్రామాగా రాబోతున్న తమ్ముడు సినిమా కోసం డైరెక్టర్ శ్రీరామ్ వేణు స్పెషల్ గా యాక్షన్ సీక్వెన్సులు డిజైన్ చేయిస్తున్నట్టు టీం తెలిపింది. ఈ సినిమా నాకోసం తాజాగా హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో కోటి రూపాయలతో నిర్మించిన స్పెషల్ సెట్ లో నితిన్ కాకుండా మిగతా ఆర్టిస్టులతో 7 రోజుల పాటు ఫైట్ సీక్వెన్సులు తెరకెక్కించబోతున్నారని అంటున్నారు.

Revanth Reddy: ఆవిర్భావ వేడుకలకు తప్పకుండా రావాలి.. కేసీఆర్ కు రేవంత్ ఆహ్వానం

ఈ ఫైట్ సీక్వెన్స్ ను కేజీఎఫ్ 1, కాంతార చిత్రాల ఫైట్ మాస్టర్ విక్రమ్ మోర్ రూపొందిస్తున్నారని అధికారిక ప్రకటన వచ్చింది. తమ్ముడు కథలో హీరోతో పాటు మిగతా కాస్టింగ్ కు మంచి ఇంపార్టెన్స్ ఉంటుందని అంటున్నారు. నితిన్ తో పాటు కీ ఆర్టిస్టులతో ఇప్పటికే 8 కోట్ల రూపాయల బడ్జెట్ తో భారీ యాక్షన్ షెడ్యూల్ ఆర్ ఎఫ్ సీలో షూట్ చేశారు. అంతకుముందు మారేడుమిల్లిలో ఒక యాక్షన్ షెడ్యూల్ జరిగిందని, ఈ మూడు యాక్షన్ సీక్వెన్సులు తమ్ముడు సినిమాలో హైలైట్ కాబోతున్నాయని అంటున్నారు. ఐక్య ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, లయ, మలయాళ నటి స్వస్విక కీలక పాత్రల్లో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే.

Exit mobile version