యంగ్ హీరో నితిన్ “మాచర్ల నియోజకవర్గం” సినిమా షూటింగ్‌లో చాలా బిజీగా ఉన్నాడు. ఎస్ఆర్ శేఖర్ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్-ప్యాక్డ్ మాస్ ఎంటర్‌టైనర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత నితిన్ చేయనున్న సినిమా “పవర్ పేట” అంటూ ప్రచారం జరిగింది. ఈ మాస్ ఎంటర్‌టైనర్ కు గీత రచయిత నుండి దర్శకుడిగా మారిన కృష్ణ చైతన్యతో చర్చలు జరిపాడు నితిన్. కానీ తెలియని కారణాల వల్ల ఆ చిత్రం ఆగిపోయింది. అయితే ఇప్పుడు నితిన్ మరో రెండు కొత్త ప్రాజెక్ట్‌లకు సైన్ చేసినట్టు తెలుస్తోంది.
Read Also : KGF Chapter 2 : ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హోస్ట్ గా టాప్ ప్రొడ్యూసర్
వక్కంతం వంశీ మొదటి చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఈ ఏడాది చివర్లో మూవీ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి ‘జూనియర్’ అనే టైటిల్ ను పెట్టనున్నట్లు సమాచారం. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. దీని తర్వాత నితిన్ టాప్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కలిసి ఓ సినిమా చేయనున్నాడు. వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్ కూడా ఇటీవలే ఖరారైనట్టు సమాచారం. త్వరలో ఈ చిత్రాలకు సంబంధించిన నటీనటులు, సిబ్బంది వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.
