NTV Telugu Site icon

Nithiin: నితిన్ కామెంట్స్ అల్లు అర్జున్ “చెప్పను బ్రదర్” గురించేనా?

Nithiin

Nithiin

యంగ్ హీరో నితిన్ తన కొత్త సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఈరోజు ట్రైలర్ బయటకి రానున్న ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీ డిసెంబర్ 8న రిలీజ్ కానుంది. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్న హీరో నితిన్ ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానం గురించి యాంకర్ ని చెప్తూ… “నాకు పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టం, నేను ఆయన ఫ్యాన్ ని… ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలోనే కాదు నా చాలా సినిమాల్లో ఆయన రిఫరెన్స్ ఉంటుంది. అది కావాలని చేసింది కాదు అండ్ పవన్ కళ్యాణ్ పేరుని చాలా మంది సినిమాల్లో వాడుకుంటూ ఉంటారు. వాళ్లు చెప్పారు నేను ఓపెన్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని అని చెప్పుకుంటాను అంటూ నితిన్ మాట్లాడాడు.

ఈ మాటలకి యాంకర్… “చాలా మంది పవన్ కళ్యాణ్ పేరుని స్టార్టింగ్ లో వాడుకుంటారు కానీ ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత కూడా నేను ఆ హీరో ఫ్యాన్ ని ఓపెన్ గా చెప్పారు మీరు మాత్రం అలానే ఉన్నారు” అనడంతో నితిన్… “నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాడిని, నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అది నాకు స్టార్ ఇమేజ్ వచ్చాక కూడా అలానే ఉంటుంది. అంతేకానీ కెరీర్ స్టార్టింగ్ లో ఆయన పేరుని వాడుకోని… నాకు ఇమేజ్ వచ్చిన తర్వాత నాకు నేనే స్టార్ ని అని చెప్పుకునే రకం నేను కాదు” అన్నాడు. నితిన్ చెప్పింది తన గురించే అయినా సోషల్ మీడియాలో మాత్రం నితిన్ చెప్పింది అల్లు అర్జున్ గురించి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. బన్నీ కూడా కెరీర్ స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్ పేరుని చాలా ఎక్కువగా వాడాడు కానీ “చెప్పను బ్రదర్” అనే ఒక్క మాట పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య దూరాన్ని పెంచింది. ఆ తర్వాత కూడా అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ కలిసి కనిపించారు, మెగా-అల్లు కుటుంబాలు కలిసి వేడుకలు జరుపుకుంటున్నాయి కానీ ఈ దూరం మాత్రం తగ్గలేదు. లేటెస్ట్ గా నితిన్ కామెంట్స్ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వైరల్ చేస్తుండడంతో చాలా మంది మెగా అభిమానులకి “చెప్పను బ్రదర్” కాంట్రవర్సీ గుర్తొచ్చి ఉంటుంది.