Site icon NTV Telugu

Nindha: వరుణ్ సందేశ్ కెరీర్ హయ్యెస్ట్ కలెక్షన్లు రాబడుతున్న ‘నింద’!!

Nindha Review

Nindha Review

ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం దర్శకత్వం వహించి నిర్మించిన నింద సినిమా జూన్ 21న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. . వరుణ్ సందేశ్ ఈ చిత్రంలో అద్భుతమైన నటనను కనబర్చారని ఆడియన్స్, విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి, మీడియా నుంచి మంచి టాక్ తో పాటు రివ్యూలు కూడా వచ్చాయి. దర్శకుడు రాజేష్ జగన్నాధం తన తొలి ప్రయత్నంలో సఫలమయ్యారని వాస్తవ సంఘటనల ఆధారంగా ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో వచ్చిన నింద బాగుందని కూడా కొందరు అభిప్రాయపడ్డారు. ఇక ఇప్పుడు తమ నింద సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోందని టీం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వారంలో చాలా చిన్న సినిమాలు రిలీజ్ అయినా ఈ సినిమా మీద కాస్త బజ్ ఎక్కువ ఉంది.

Renuka Swamy Case: దర్శన్ పేరును లీక్ చేసిన ఆ నలుగురికి కోర్టు స్పెషల్ పర్మిషన్.. ఎందుకంటే?

దీంతో ఈ వారం రిలీజ్ అయిన అన్ని చిత్రాల్లోకెల్లా నింద మంచి కలెక్షన్లతో దూసుకుపోతోందని టీం ప్రకటించింది. అంతేకాదు వరుణ్ సందేశ్ కెరీర్‌లో ఈ సినిమా హయ్యస్ట్ ఓపెనింగ్స్‌ సాధించిందని కూడా వెల్లడించింది. ఈ వీకెండ్‌లో తెలుగు రాష్ట్రాల్లో నెం.1 వసూళ్లు సాధించిన చిత్రంగా నింద నిలవనుందని కూడా పేర్కొన్నారు. ఇంట్రెస్టింగ్ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా పెట్టుబడిని రికవరీ చేస్తూ కమర్షియల్‌గా హిట్‌ అవుతుందని ట్రేడ్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అన్నీ, శ్రేయ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై ఇతర ముఖ్య తారాగణంగా నటించిన ఈ చిత్రానికి రమీజ్ నవీత్ కెమెరా, సంతు ఓంకార్ సంగీతం అందించారు. అనిల్ కుమార్ ఎడిటింగ్ చేశారు.

Exit mobile version