Nikki Galrani Gives Clarity On Pregnancy Rumours: కొన్ని రోజుల నుంచి నిక్కీ గల్రానీ గర్భం దాల్చిందన్న వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు.. త్వరలోనే తన ప్రెగ్నెన్సీ విషయాన్ని నిక్కీ అధికారికంగా వెల్లడించనుందని కూడా ప్రచారం జోరందుకుంది. అయితే.. ఈ వార్త మరింత వైరల్ అవ్వడానికి ముందే, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని నిక్కీ గల్రానీ స్పష్టం చేసింది. తాను గర్భం దాల్చినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని, అసలు ఈ బిగ్ న్యూస్ గురించి తనకే అవగాహన లేదంటూ వ్యంగ్యంగా స్పందించింది.
‘‘ఏంటి.. నేను ప్రెగ్నెంటా.. ఇంత పెద్ద న్యూస్ నాకే తెలీదే’’ అంటూ మొదట్లో సెటైరికల్‌గా పోస్ట్ పెట్టిన నిక్కీ.. ‘‘నేను గర్భం దాల్చినట్లు వార్తల్ని వైరల్ చేస్తున్న ఆ కొద్దిమంది వ్యక్తులు నా డెలివరీ డేట్ ఎప్పుడో కూడా చెప్తే బాగుంటుంది’’ అంటూ వ్యంగ్యంగా బదులిచ్చింది. ఆ తర్వాత తాను గర్భం దాల్చలేదని, ఒకవేళ తాను ప్రెగ్నెంట్ అయితే.. ఆ అమేజింగ్ వార్తను తానే అందరి కన్నా ముందు పంచుకుంటానని నిక్కీ స్పష్టం చేసింది. దయచేసి రూమర్లను పట్టించుకోవద్దని నిక్కీ రిక్వెస్ట్ చేసింది. దీంతో.. నిక్కీ గల్రానీ ప్రెగ్నెంట్ అయ్యిందన్న వార్తలకు చెక్ పడినట్టయ్యింది.
కాగా.. చాలాకాలం నుంచి డేటింగ్ చేస్తూ వచ్చిన ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ.. ఈ ఏడాది మే నెలలో వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందు వీళ్లిద్దరు మరగత నాయన్ (మరకతమణి), యగవరయినుమ్ నా కాక్క సినిమాల్లో కలిసి నటించారు. ఆది నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో.. పెళ్లయ్యాక కూడా నిక్కీ సినిమాల్లో కొనసాగుతోంది. అటు ఆది సైతం హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ దూసుకెళ్తున్నాడు.
Nikki Clarity On Pregnancy1
