Site icon NTV Telugu

Nikhil: ‘కర్తవ్య పథ్’ దగ్గర లాంచ్ కానున్న ‘స్పై’ టీజర్…

Nikhil Siddharth

Nikhil Siddharth

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా ‘స్పై’. అడివి శేష్ నటించిన ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ సినిమాలకి ఎడిటర్ గా వర్క్ చేసిన గ్యారీ ‘స్పై’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. హై బడ్జట్ తో, స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ గా రూపొందుతున్న స్పై మూవీని మేకర్స్ జూన్ 29న రిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు. ప్రమోషన్స్ ని మొదలు పెట్టిన చిత్ర యూనిట్, గత కొన్ని రోజులుగా బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్ ని రిలీజ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా స్పై టీజర్ రిలీజ్ కి రెడీ అయిన మేకర్స్, మే 15న టీజర్ రిలీజ్ డేట్ ని లాక్ చేశారు. పాన్ ఇండియా సినిమా చేస్తే సరిపోదు పాన్ ఇండియా రేంజులో ప్రమోషన్స్ కూడా చెయ్యాలి అనే విషయాన్ని కార్తికేయ 2 సినిమాతోనే బాగా తెలుసుకున్న నిఖిల్, స్పై సినిమా ప్రమోషన్స్ ని కూడా నార్త్ నుంచే మొదలుపెట్టాడు.

Read Also: Mahesh Babu: ఆరోజు రీజనల్ సినిమాల్లో కొత్త రికార్డ్ క్రియేట్ అయ్యింది

ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్, లెజెండరీ సుభాష్ చంద్ర బోస్ గురించి ఉన్న కాన్స్పిరసీని స్పై సినిమాలో రివీల్ చేయ్యబోతున్నట్లు ప్రమోట్ చేస్తున్నారు. సుభాష్ చంద్ర బోస్, స్పై సినిమాకి లింక్ ఉండడంతో ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో ఉన్న నేతాజీ విగ్రహం దగ్గర స్పై సినిమా టీజర్ ని రిలీజ్ చేస్తున్నారు. కర్తవ్య పథ్ లాంటి ఐకానిక్ లొకేషన్ లో జరుగుతున్న మొదటి సినిమా టీజర్ లాంచ్ ఇదే కావడం విశేషం. స్పై సినిమా ప్రమోషన్స్ కి పర్ఫెక్ట్ లొకేషన్ ని ఎంచుకున్న నిఖిల్, టీజర్ లో మంచి హై ఇస్తే చాలు సినిమాపై అంచనాలు పీక్ స్టేజ్ లోకి వెళ్లిపోతాయి. ఇక్కడి నుంచి ప్రాపర్ గా స్పై సినిమాని ప్రమోట్ చేసుకుంటే నిఖిల్ ఖాతాలో జూన్ 29న మరో పాన్ ఇండియా హిట్ పడినట్లే.

Exit mobile version