ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు మాత్రమే కాదు. తాను కూడా పాన్ ఇండియా లెవల్లో రాణించగలనని నిరూపించుకున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్త్. ఈయన నటించిన కార్తికేయ 2 సినిమా భారీ విజయాన్ని అందుకుంది. నిఖిల్‌కు కూడా పాన్ ఇండియా లెవల్లో ఫాలోవర్స్ పెరిగారు. ఇక ఈ సినిమా తర్వాత 18 పేజెస్ మూవీ పర్వాలేదనిపించుకున్నాడు నిఖిల్. అయితే ఇప్పుడు మరోసారి పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం స్పై.. ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో.. ప్రమోషన్స్ స్పీడప్ చేశారు మేకర్స్. రీసెంట్‌గా రిలీజ్ చేసిన స్పై ట్రైలర్.. సినిమా పై మంచి బజ్ క్రియేట్ చేసింది.
తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఎలాంటి కట్స్ లేకుండా.. యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. రన్ టైం వచ్చేసి 2 గంటల 15 నిమిషాలుగా లాక్ చేశారట. ఇక ఈ సినిమా చూసిన తర్వాత.. సెన్సార్ సభ్యులు ప్రశంసల వర్షం కురిపించారట. ఖచ్చితంగా నిఖిల్ కెరీర్లో మరో బిగ్గెస్ట్ హిట్‌గా స్పై నిలుస్తుందని అన్నారట. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ జోష్‌లో ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణ మిస్టరీని టచ్ చేస్తూ తెరకెక్కిన ఈ సినిమాలో.. నిఖిల్‌కు జోడిగా ఐశ్యర్య మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఈడీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై కె. రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. మరి స్పైతో.. నిఖిల్ మరో పాన్ ఇండియా హిట్ కొడతాడేమో చూడాలి.
https://twitter.com/actor_Nikhil/status/1672468880638504960
