NTV Telugu Site icon

Nikhil Siddhartha : తండ్రి మృతిపై ఎమోషనల్ పోస్ట్

Nikhil

Nikhil

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తండ్రి శ్యామ్ సిద్ధార్థ ఏప్రిల్ 28న తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. పితృవియోగంతో దుఃఖంలో మునిగిపోయిన నిఖిల్ తాజాగా తన తండ్రిని తలచుకుంటూ ఓ సుదీర్ఘ ఎమోషనల్ నోట్ ను షేర్ చేశారు. అందులో తండ్రి కార్టికో బేసల్ డీజెనరేషన్ అనే అరుదైన వ్యాధితో గత 8 ఏళ్ళ నుంచి పోరాడుతున్నారని, ఆయన ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ లకు డైహార్డ్ ఫ్యాన్ అని వెల్లడించారు. తనను కూడా ఏదో ఒకరోజు వెండితెరపై మంచి నటుడిగా చూడాలని కలలు కన్నారని, తీరా ఆ కల నెరవేరే సమయానికి ఆయన లేరని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి JNTU ఎలక్ట్రానిక్ ఇంజనీర్, స్టేట్ టాపర్ అని, వేలాది మంది విద్యార్థులకు మార్గనిర్దేశం చేశాడని తెలిపారు.

Read Also : Samantha : స్కామ్‌స్టర్స్… విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ పై రియాక్షన్

“మీరు ఎక్కడ ఉన్నా శాంతి లభిస్తుందని ఆశిస్తున్నాను నాన్న. మేము నిన్ను ప్రేమిస్తున్నాము. చాలా మిస్ అవుతున్నాము. మేము మీ గురించి ఆలోచించకుండా ఒక్కరోజు కూడా గడవదు. క్రాస్ రోడ్ మూవీ, బిర్యానీ ఔటింగ్‌లు, సుదూర ప్రాంతాలకు లాంగ్ డ్రైవ్‌లు, ముంబైలో వేసవి… ఇవన్నీ మిస్ అవుతాము. నేను మీ కుమారుడిగా గర్వపడుతున్నానని చెప్పాలనుకుంటున్నాను. మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నాను నాన్న” అంటూ నిఖిల్ బరువెక్కిన హృదయంతో ఈ ఎమోషనల్ నోట్ ను ముగించాడు.