యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన శంకరాభరణం సినిమా 2015లో రిలీజ్ అయ్యింది. నందిత రాజ్, అంజలి నటించిన ఈ సినిమాని ఎంవీవీ సత్యనారాయణ ప్రొడ్యూస్ చేసాడు. 2010లో వచ్చిన ‘ఫస్ గయ్ రేయ్ ఒబామా’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని అలరించలేకపోయింది. దీంతో శంకరాభరణం సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ‘ఉదయ్ నందనవనం’ కెరీర్ కష్టాల్లో పడింది. దాదాపు ఎనిమిదేళ్ల పాటు రెండో సినిమా ప్రయత్నాలు చేస్తూనే ఉన్న ఉదయ్, ఎట్టకేలకు తన కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చేసాడు. ప్రముఖ కన్నడ నటుడు దేవరాజ్ తెలుగు చిత్రసీమ ప్రేక్షకులకూ సుపరిచితులే. ఆయన పెద్ద కుమారుడు, డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా ఉదయ్ సినిమాని అనౌన్స్ చేసాడు.
Read Also: Adipurush: రజినీ, మహేష్ రికార్డులు బ్రేక్… ఇప్పుడు ప్రభాస్ టాప్
వర్థమాన్ ఫిల్మ్స్, లోటస్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ ప్రొడ్యూసర్ గోవర్థన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకి ‘జాతర’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన మేకర్స్, గ్రాండ్ గా అనౌన్స్ చేసారు. ఆగస్టులో ‘జాతర’ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. దర్శకుడు ఉదయ్ నందనవనమ్ మాట్లాడుతూ ”సినిమాలో ప్రేమకథ ఎంత అందంగా ఉంటుందో… నేపథ్యం కూడా అంతే కొత్తగా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా కథ, కథనం ఉంటాయి. త్వరలో కథానాయిక వివరాలు వెల్లడిస్తాం” అని చెప్పారు.
