NTV Telugu Site icon

Nikhil: ‘కార్తికేయ -2’ సినిమా విడుదల వాయిదా

Karthikeya 2

Karthikeya 2

యంగ్ హీరో నిఖిల్, ప్రామిసింగ్ డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్‌లో ‘కార్తికేయ’కి సీక్వెల్ గా వస్తున్న ‘కార్తికేయ‌ -2′ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు చక్కని స్పందన వచ్చింది. క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొన‌సాగిస్తూ విజ‌యాలు సొంతం చేసుకుంటున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై టి. జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జూలై 22న విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇటీవల చిత్ర బృందం ప్రమోషనల్ టూర్ కూడా చేసింది. ఈ రోజు సాయంత్రం ఈ మూవీలోని “నన్ను నేను అడిగా’ అనే వీడియో సాంగ్ ను జీ మ్యూజిక్ సౌత్ లో విడుదలకు ప్లాన్ చేశారు. అయితే అనివార్యంగా ఈ సినిమా విడుదల వాయిదా పడిందని మంగళవారం తెల్లవారు ఝామున హీరో నిఖిల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తమ చిత్రం ఆగస్ట్ మొదటి వారంలో జనం ముందుకు వచ్చే ఆస్కారం ఉందని ప్రకటించాడు.

Read Also: Krishna Vamsi: తెలంగాణ సాయుధ పోరాటంపై వెబ్ సిరీస్.. 300 కోట్ల బడ్జెట్

‘కార్తికేయ -2’ మూవీలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్.. నిఖిల్ కి జంట‌గా న‌టిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రను పోషించారు. ఈ సినిమాలో ఆసక్తికరమైన విషయం డాక్టర్ కార్తికేయ ప్రయాణం. శ్రీకృష్ణుడు చ‌రిత్ర‌లోకి నిఖిల్ ఎంటర్ కావడం ఇందులోని విశేషం. కాలభైరవ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించారు. మరి ఆగస్ట్ మొదటి వారంలో ‘కార్తికేయ -2’ విడుదలకు సిద్ధపడితే.. ఇప్పటికే 5వ తేదీకి కళ్యాణ్‌ రామ్ ‘బింబిసార’, దుల్కర్ సల్మాన్ ‘సీతారామం’, సత్యదేవ్ ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలు కర్చీఫ్‌ వేసి పెట్టాయి.