NTV Telugu Site icon

Nikhil: ప్లాప్ ఎఫెక్ట్.. ఆ కండీషన్లు పెట్టిన నిఖిల్.. ?

Nikhil

Nikhil

Nikhil: యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. కార్తికేయ 2 తర్వాత స్పై అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నిఖిల్. ఎన్నో అంచనాల మధ్య జూన్ 29 న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే.. స్పై సినిమా ప్లాప్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవుట్ పుట్ సరిగా రాలేదని, రిలీజ్ విషయంలో నిర్మాతలతో గొడవ పడిన నిఖిల్ చివరికి ఏదో ఒక విధంగా రిలీజ్ కి ఒప్పుకున్నాడు. అందుకే స్పై పరాజయం పాలయ్యిందని టాక్. ఇక స్పై విషయంలో జరిగిన తప్పును నిఖిల్ నిర్మొహమాటంగా అభిమానుల ముందు ఒప్పుకున్నాడు. ఇంకోసారి ఇలాంటి తప్పు జరగదని, ఇకముందు మంచి సినిమాలను అభిమానులకు అందిస్తానని ఒక లేఖ ద్వారా చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలోని తన తదుపరి సినిమాల విషయంలో నిఖిల్ చాలా జాగ్రత్తగా పడుతున్నాడట.

Samantha: విరామం అనేది చెడ్డ విషయం కాదు.. సామ్ పోస్ట్ వైరల్

ప్రస్తుతం నిఖిల్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. స్వయంభు, ది ఇండియన్ హౌస్, కార్తికేయ3. ఈ సినిమాలలో ప్రస్తుతం నిఖిల్ స్వయంభు షూటింగ్లో పాల్గొంటున్నాడు. భరత్ కృష్ణమాచార్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పిక్సెల్ స్టూడియోస్ పై భువన్ శేఖర్ నిర్మిస్తున్నాడు. పిరీయాడిక్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా విషయంలో నిఖిల్ మొదటి నుంచి ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటున్నాడట. అంతేకాకుండా డైరెక్టర్ కు, నిర్మాతకు కండీషన్లు కూడా పెట్టినట్లు తెలుస్తుంది. ఫైనల్ అవుట్ పుట్ విషయంలో తాను సంతృప్తి చెందితే కానీ సినిమా రిలీజ్ చేయకూడదని దర్శక నిర్మాతలతో తేల్చి చెప్పాడట. అంతేకాకుండా ప్రమోషన్స్ సైతం గట్టిగా చేయాలని దానికి నిర్మాతలు సహకరించాలని,వీటన్నింటికి ఓకే అంటేనే షూటింగ్ చేస్తానని చెప్పినట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలి.