NTV Telugu Site icon

Swayambhu: నిఖిల్ భయ్యా.. కొంచెం గ్యాప్ ఇవ్వవయ్య్యా

Nikhil

Nikhil

Swayambhu: హీరో నిఖిల్ స్పీడ్ చూస్తుంటే.. ఈ ఏడాదిలోనే మూడు నాలుగు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ఉన్నాడు. కార్తికేయ 2 తో పాన్ ఇండియా రేంజ్ ను అందుకున్న నిఖిల్.. ఆ సినిమా హిట్ అందుకోగానే స్పై ని దింపాడు. మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక దాని షూటింగ్ మొదలుపెట్టాడో లేదో కార్తికేయ 3 కూడా త్వరలోనే రిలీజ్ కానున్నట్లు తెలిపి షాక్ ఇచ్చాడు. సరే ఇదెప్పటి నుంచి వింటున్నదే కదా అనుకొనేలోపు రామ్ చరణ్ కొత్త బ్యానర్ లో హీరో ఛాన్స్ పట్టేసి ఔరా అనిపించాడు. ది ఇండియన్ హౌస్ లాంటి వివాదస్పద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చెప్పుకొచ్చాడు. హా.. నిఖిల్ బ్రో.. వరుస సినిమాలు.. షూటింగ్స్ మొదలుపెట్టేసి.. అప్డేట్స్ ఇవ్వు అని ఏ ముహూర్తాన అభిమానులు అన్నారో తెలియదు కానీ.. ఒక సినిమా అప్డేట్స్ ను పక్కన పెడితే.. వరుస సినిమాల అప్డేట్స్ ఇస్తూ షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. ఈ మూడు సినిమాలు కాకుండా మరో సినిమాను విత్ టైటిల్ తో సహా రివీల్ చేసి మిగతా హీరోలకు నోటివెంట మాట రానివ్వకుండా చేస్తున్నాడు.

Siddharth Roy Teaser: మరో ‘అర్జున్ రెడ్డి’ లా ఉంది.. ‘అతడు’ బుడ్డోడుకు హిట్ అందేనా

నేడు నిఖిల్ బర్త్ డే సందర్భంగా నిఖిల్ 20 వ చిత్రాన్ని మేకర్స్ ప్రకటించారు. మొట్టమొదటిసారి నిఖిల్ పీరియాడికల్ డ్రామాలో నటిస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ ప్రకటించారు. స్వయంభు అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పిక్సల్ స్టూడియోస్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు కెజిఎఫ్ కు మ్యూజిక్ అందించిన రవి బసూర్ సంగీతం అందిస్తుండడం విశేషం. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ లో నిఖిల్ యుద్ధ రంగంలో నిలబడి పోరాటం చేస్తున్న యుద్ధవీరుడులా కనిపించాడు. చేతిలో బళ్లెం, బడిసా పట్టుకొని సీరియస్ లుక్ లో కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాలతో నిఖిల్ తన పాన్ ఇండియా ఇమేజ్ ను నిలబెట్టుకుంటాడా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.

Show comments