Site icon NTV Telugu

Niharika Konidela: వాట్ ది ఫిష్… మంచు మనోజ్ తప్పుకున్నాడా.. ఆమె కోసం తప్పించారా.. ?

Manoj

Manoj

Niharika Konidela: సాధారణంగా ఇండస్ట్రీలో ఒక సినిమా.. ఒక హీరోతో మొదలయ్యింది అంటే.. అది రిలీజ్ అయ్యేవరకు ఆ హీరోనే ఉంటాడు అని కాన్ఫిడెంట్ గా చెప్పలేం. చివరి నిమిషంలో ఎవరైనా మారొచ్చు. ఇలా ఎన్నో సినిమాల్లో హీరోలు.. కొన్ని కారణాల వలన బయటకు వచ్చేశారు. ప్రస్తుతం మంచు మనోజ్ సైతం అలానే బయటకొచ్చాడని టాక్. గతకొన్నాళ్ళుగా కెరీర్ కు కొంత గ్యాప్ ఇచ్చిన మనోజ్.. గతేడాది వాట్ ది ఫిష్ అనే సినిమాను అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. వరుణ్ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది అని అనుకున్నారు. రీ ఎంట్రీ గట్టిగా ఇవ్వాలని మనోజ్ అభిమానులు ఈ సినిమాపై ఎంతో ఆసక్తి చూపించారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. వాట్ ది ఫిష్ సినిమా నుంచి మనోజ్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. మనోజ్ ప్లేస్ లోనే నిహారికను తీసుకున్నారట చిత్ర బృందం.

లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా వాట్ ది ఫిష్ తెరకెక్కుతుందంట. అంతేకాకుండా ఈ సినిమాకు నిహారికనే నిర్మాతగా వ్యవహరిస్తుందని తెలుస్తోంది. డైరెక్టర్ కు మనోజ్ కు పడలేదో.. లేక ప్రొడ్యూసర్స్ చేతులు ఎత్తేశారో తెలియదు కానీ, మనోజ్ బయటకు వచ్చేశాడని.. ఇక ఆ కథ, టైటిల్ నచ్చి నిహారిక.. మనోజ్ ప్లేస్ లో తానే నటించడానికి ఒప్పుకుందని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఇంకోపక్క మనోజ్ కథ నచ్చక తప్పుకున్నాడా.. ? లేక ప్రొడక్షన్ నచ్చక తప్పుకున్నాడా.. ? లేదా ఎవరైనా తప్పించారా అనే అనుమానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఏదిఏమైనా ప్రస్తుతం మాత్రం నిహారిక మెయిన్ లీడ్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. మరి ఈ సినిమాతో నిహారిక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version