Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మనసు సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయింది నిహారిక. మెగా కుటుంబం నుంచి మొట్టమొదటి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక దారుణంగా విఫలమైంది. దీంతో ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. చైతన్య జొన్నలగడ్డతో ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లయిన మూడేళ్లకే భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో వారిద్దరూ ఈ ఏడాది అధికారికంగా విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం నిహారిక హీరోయిన్ గా తన కెరీర్ ను మళ్ళీ మొదలు పెట్టడానికి సిద్ధమవుతుంది. నటిగా, నిర్మాతగా ఆమె ముందు ముందు విజయాలను అందుకోవడానికి బాగానే కష్టపడుతుంది.
ఇక ప్రస్తుతం నిహారిక చేతిలో రెండు సినిమాలు, ఒక కుకింగ్ షో ఉన్నాయి. సినిమాల విషయం పక్కన పెడితే.. ఇండస్ట్రీలో నిహారికకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా.. ఆమెకంటూ ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ ఉన్న విషయం తెల్సిందే. వారే వితిక షేరు, మహాతల్లి, అంబటి భార్గవి. ఈ ముగ్గురుతోనే నిహారిక నిత్యం వెకేషన్స్ కు వెళ్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యాక్ గోవా వెకేషన్ కు వెళ్లారు. అయితే ఈ వెకేషన్ లో వితిక మిస్ అయ్యినట్లు కనిపిస్తుంది. అంబటి భార్గవి పుట్టినరోజు కావడంతో.. ఆమె బర్త్ డే సెలబ్రేషన్స్ గోవాలో జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఇక గోవా బీచ్ వద్ద ఈ బ్యాచ్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను నిహారిక ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక ఇందులో బీచ్ ఒడ్డున ఈ ముద్దుగుమ్మలు హల్చల్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి నిహారిక రీ ఎంట్రీలో అయినా విజయం అందుకుంటుందేమో చూడాలి.
