మెగా డాటర్ నిహారిక ఈ మధ్య బాగా రెచ్చిపోతుంది.. వారి ఫ్యామిలీ పరువు బయటకు నెట్టేస్తుంది.. ఇప్పటికే విడాకుల వ్యవహారంతో మెగా వారి ఫ్యామిలీ పరువు ను తీసింది.ఇక ఈ మధ్య తన హాట్ అందాలు బయటపెట్టేస్తూ బాగా రచ్చ చేస్తుంది. అయితే తాజాగా తను ఒక ఫోటో షేర్ చేసుకోగా అందులో తను హద్దులు మీరుతూ కనిపించిందటా.మెగా ఫ్యామిలీ నుండి తొలి హీరోయిన్ గా అడుగుపెట్టగా ఎక్కువకాలం ముందుకు కొనసాగలేక పోయింది నిహారిక. అవకాశాలు కూడా అంతగా అయితే అందుకోలేకపోయింది. దీంతో తాను సినిమాలకు కూడా దూరంగా ఉంటుంది. తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి 2016లో ఒక మనసు సినిమా ద్వారా ఆమె తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సైరా నరసింహారెడ్డి, సూర్యకాంతం వంటి సినిమాలలో కూడా నటించింది.కానీ ఈ సినిమాలు ఏవి కూడా తనకు అంత గా సక్సెస్ ఇవ్వకపోయినా తన నటనకు మాత్రం ఎంతో కొంత గుర్తింపు ను సొంతం చేసుకుంది. తమిళంలో కూడా ఓ సినిమాలో ఆమె నటించింది. అలా 2019లో చివరిసారి గా నటించింది. ఇక జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత బాగా యాక్టివ్ గా మారింది. నిర్మాతగా కూడా బాధ్యతలు కూడా చేపట్టింది. తన భర్తతో కలిసి తెగ ట్రిప్స్ ను ఎంజాయ్ చేసింది.పెళ్లి తరువాత తన కొత్త కొత్త లుక్ లతో తన ఫాలోవర్స్ ని కూడా తెగ ఫిదా చేస్తుంది.
ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫాలోవర్స్ తో నిత్యం టచ్ లో ఉంటూ వారితో ముచ్చట్లు కూడా పెడుతూ నే ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేస్తుంది.. అప్పుడప్పుడు పలు ఆన్లైన్ ప్రకటనలు కూడా ఆమె చేస్తూ ఉంటుంది.అలా హ్యాపీగా సాగుతున్న తన జీవితంలో కొంతకాలం నుంచి కొన్ని వ్యవహారాలు ఆమె పరువును తీసే విధంగా చేశాయి. ఆ సమయంలో మెగా సపోర్ట్ ఎక్కువగా ఉండటంతో సైలెంట్ గా ఉండిపోయిందటా.. అయితే కొన్ని రోజుల నుండి తన భర్తతో విడిపోతున్న సంగతి కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అంతేకాకుండా తన భర్త తమ పెళ్లి ఫోటోలను, కలిసి దిగిన ఫోటోలను కూడా డిలీట్ చేశాడు అని తెగ వార్తలు వచ్చాయి