Niharika Ex Husband Sensational Comments on Her Latest Interview: మెగా డాటర్ నిహారిక కొణిదెల చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తిని వివాహం చేసుకుని విబేధాల వలన గతేడాది విడాకులు తీసుకొని విడిపోయారు. విడాకుల తర్వాత ఇప్పటివరకు విడాకుల గురించి మాట్లాడని నిహారిక ఒక పాడ్ కాస్ట్ లో భర్తతో విడాకులపై మొదటిసారి నోరు విప్పింది. ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకునే ముందు ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలని, అది జరుగకపోతే మనకు సెట్ అవని వ్యక్తిపై ఆధారపడకూడదని పేర్కొంది. వాళ్లు మన ఇంట్లో అమ్మానాన్నలా ఉండరు, ముఖ్యంగా అంత ప్రేమగా అస్సలు చూసుకోలేరని చెప్పుకొచ్చింది. నాది పెద్దలు కుదిర్చిన సంబంధం. విడాకులు తీసుకున్న సమయంలో నన్ను చాలా మాటలు అనడంతో బాధ తట్టుకోలేక ఎంతో ఏడ్చా, అలాంటి వాటిని భరించడం అంత ఈజీ కాదని అన్నారు. మా ఇద్దరికి సెట్ అవ్వలేదు. కలిసి ఉండాలనే నేను కోరుకున్నా, కానీ మనం అనుకున్నవే జరగాలని లేదని చెప్పుకొచ్చింది. ఈ రెండేళ్లలో కుటుంబం విలువ ఏంటో తెలిసింది, పెళ్లి-విడాకుల తర్వాత ఎవర్నీ నమ్మకూడదని అర్దమైంది, ఇదొక గుణపాఠం అని పేర్కొంది. అంతేకాదు నేను ఎప్పటికీ సింగిల్ గా ఉండాలనుకోవడం లేదు నా వయస్సు 30 కాబట్టి మంచి వ్యక్తి ఎదురుపడితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియో గురించి ఇంటర్వ్యూ చేసిన నిఖిల్ ఇంస్టాగ్రామ్ పోస్టులో నిహారిక మాజీ భర్త చైతన్య స్పందించాడు.
Allu Arjun: మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డుపై అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటో తెలుసా?
నిహారికపై ఇటీవల జరుగుతున్న అన్యాయమైన నెగిటివిటీ దూరం చేయడానికి మీరు చేసిన ప్రయత్నాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను, వ్యక్తిగత సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఆ నెగిటివిటీని ఎదుర్కోవడం అంత సులభం కాదని నాకు తెలుసు. అయితే వివాహానికి సంబంధించి బాధితురాలి ట్యాగ్‌లను పరోక్షంగా అటాచ్ చేయడానికి రీచ్, ప్లాట్‌ఫారమ్స్ ను ఉపయోగించడం మానేయాలి. ఇలా జరగడం ఇది రెండోసారి, పెళ్లి అయ్యాక సెట్ కాకపోతే వచ్చే బాధ, దాని నుంచి బయట పడడం ఇద్దరికీ ఒకేలా ఉంటుంది. విడాకుల గురించి అది పూర్తయ్యాక మాట్లాడకూడదు, మరీ ముఖ్యంగా ఒకరి వైపు నుంచే మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు. అయితే పెళ్లి విఫలం అయితే వచ్చి పెయిన్ గురించి, దాని నుంచి బయటపడడం గురించి మాట్లాడవచ్చు ఎందుకంటే అది వేరొకరికి ఉపయోగపడచ్చు. భవిష్యత్తులో ఇలా ఇంటర్వ్యూ చేసేప్పుడు, నిజం తెలుసుకోవడం, ప్రజలకు అవగాహన కల్పించడం పట్ల మీకు ఆసక్తి ఉన్నట్లయితే, ఇద్దరినీ పూర్తిగా విచారించి టైమ్‌లైన్ తెలుసుకుని అప్పుడే మాటలు మాట్లాడాలి. కానీ పూర్తిగా విషయం తెలియకుండా ప్రజలకి తీర్పు చెప్పడం అన్యాయమని నేను భావిస్తున్నాను, అది తప్పు అయితే, నాణేనికి ఒక వైపు నుండి ఈ ప్లాట్‌ఫారమ్‌ని ఉపయోగించుకుని పరోక్ష సందేశాన్ని ఇవ్వాలని ప్రయత్నించడం కూడా అంతే తప్పు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను, ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు.