NTV Telugu Site icon

Niharika Divorce: సమంత రూ.250 కోట్లు.. నిహారిక రూ. 100 కోట్లు.. ఎలారా ఇలా.. ?

Niha

Niha

Niharika Divorce: సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి ఆహరం తింటారు.. ? ఎలాంటి బట్టలు వేసుకుంటారు..? ఎలాంటి ఇళ్లలో ఉంటారు.. ? ఇలాంటివన్నీ తెలుసుకోవాలని వారిలా బతకాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే చాలామంది వారు కూడా అందరిలానే మనుషులే.. వారికి కూడా ఒక వ్యక్తిగత జీవితం ఉందని అర్ధం చేసుకోరు. వారికి కూడా ఒక లైఫ్ ఉంటుంది. ఎవరి వ్యక్తిగత జీవితాల్లో వారు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. కానీ, సెలబ్రిటీల ఎదుర్కుంటున్న సమస్యలపై సోషల్ మీడియాలో డిబేట్ లు డిబేట్లు పెట్టేస్తున్నారు ట్రోలర్స్. ముఖ్యంగా హీరోయిన్లు ఎఫైర్స్, డివోర్స్ పై సోషల్ మీడియాలో జరిగే చర్చ అంతా ఇంతా కాదు. ఒక హీరోయిన్ విడాకులు తీసుకున్నది అని ప్రకటించడం ఆలస్యం.. విడాకులు అవ్వడానికి కారణాలు ఏంటి అన్నదగ్గరనుంచి.. మొదట ఎవరు విడాకులు అడిగారు..? గొడవ ఎక్కడ మొదలైంది.. విడాకుల ఇవ్వడానికి, తీసుకోవడానికి భరణం ఎంత ఇచ్చారు అని సోషల్ మీడియాలో చర్చలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న సమంత విషయం లో ఇలాగె జరిగింది. నాగ చైతన్యతో విడిపోవడానికి సమంత రూ.250 కోట్లు భరణం అడిగిందని, అది చై ఇచ్చాడని ఏవేవో పుకార్లు పుట్టించారు. అయితే అందులో ఎలాంటి నిజం లేదని సమంత క్లారిటీగా చెప్పేసింది. అయినా ఇప్పటికీ సామ్ విడాకుల న్యూస్ హాట్ టాపిక్ గానే ఉంటుంది.

Niharika Konidela: ఎవడేమన్నా నాకు దాంతో సమానం.. నిహారిక వీడియో వైరల్

ఇక తాజాగా మెగా డాటర్ నిహారిక విడాకుల విషయంలో కూడా భరణం గురించిన పుకార్లు మరింత హీట్ పుట్టిస్తున్నాయి. నిహారిక కొణిదెల.. చైతన్య జొన్నలగడ్డను వివాహమాడిన విషయం తెల్సిందే. నేడు నిహారిక.. తాను విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించడంతో.. నిహారిక రూ.100 కోట్లు భరణం అడిగిందని మరో పుకారు పుట్టించారు. అందులో నిజం ఏంటి..? అనేది కూడా ఎవరికి తెలియదు. కానీ, భరణం అడిగింది అంటూ చెప్పుకొస్తున్నారు. నిహారిక కానీ, చైతన్య కానీ బలవంతంగా విడాకులు తీసుకోలేదు. ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. కలిసి ఉండలేము అనుకున్నారు. మ్యూచువల్ గా విడిపోయారు. దానికి భరణంతో పని ఏముంది.. ? అసలు ఈ అమౌంట్ ఫిగర్స్.. మీకు ఎలా తెలుస్తున్నాయి అని నెటిజన్లు ట్రోలర్స్ ను ప్రశ్నిస్తున్నారు. ఇంకొందమంది అయితే.. అది వారి వ్యక్తిగత విషయం.. ఎవరు ఎంత భరణం తీసుకుంటే మీకేంటి..? అని ఫైర్ అవుతున్నారు. ఈ ట్రోలింగ్ ను అసలు సెలబ్రటీలు పట్టించుకొనే పట్టించుకోరు.. దాని గురించి మీ టైమ్ వేస్ట్ చేసుకోవడం దేనికి అని ఇంకొందరు సలహాలు ఇస్తున్నారు.