Niharika Konidela Lawyer name is Kalyan Dileep Sunkara: మెగా డాటర్ నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ తమ వైవాహిక బంధానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. పరస్పర అంగీకారంతో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో డైవర్స్ కోసం దరఖాస్తు చేసుకోగా.. నెల రోజుల కిందటే కోర్టు విడాకులను మంజూరు చేసింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతోనే విడాకులు తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా నిహారిక-చైతన్యలు వేర్వేరుగా ఉంటున్నారు. అయితే వీరద్దరిలో ఎవరు ముందుగా విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు? అని నెటిజన్లు సోషల్ మీడియాలో వెతుకుతున్నారు.
నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డల విడాకులకు (Niharika Konidela-Chaitanya Jonnalagadda Divorce) సంబందించిన ఓ కాపీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విడాకుల కోసం ముందుగా పిటిషన్ దాఖలు చేసింది చైతన్యనే అని కోర్టు విడుదల చేసిన కాపీలో ఉంది. అనంతరం నిహారిక పిటిషన్ వేశారు. నిహారిక తరుపున విడాకుల కోసం పిటిషన్ వేసిన అడ్వకేట్ పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర అని తెలుస్తోంది. అతను నిహారిక తండ్రి, సీనియర్ నటుడు నాగబాబుకు అత్యంత సన్నిహిత వ్యక్తి అట. అందుకే నిహారిక విడాకుల విషయాన్ని ఇన్ని రోజులు బయటికి రాకుండా చూశారు.
Also Read: Ajit Agarkar BCCI Chairman: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్.. కుర్రాళ్లపై ఫోకస్!
నటుడు నాగబాబు కూతురు నిహారిక కొణిదెల, గుంటూరు ఐజీ జె ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డకు 2020 ఆగస్టులో నిశ్చితార్థం జరిగింది. 2020 డిసెంబరులో వీరి పెళ్లికి రాజస్థాన్ ఉదయపూర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే రెండేళ్లకే వీరి పెళ్లి బంధం చెడింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో గత కొన్ని రోజులుగా నిహారిక-చైతన్య వేర్వేరుగా ఉంటున్నారు. వీరు విడిపోయేందుకు సిద్ధపడ్డారని సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. తాము కలిసి దిగిన ఫొటోలను ఇద్దరు సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించడంతో ఆ వార్తలకు బలం చేకూరింది.
మెగా కుటుంబంలో జరిగిన వేడుకలన్నింటికీ నిహారిక మాత్రమే హాజరుకావడం విడాకుల చర్చకు దారి తీసింది. అయితే వీటిపై ఎవరూ స్పందించలేదు. ఇప్పుడీ రూమర్లే నిజమయ్యాయి. నిహారిక-చైతన్య దంపతులు అధికారికంగా విడిపోయారు. ఇక వివాహం అనంతరం సినిమాలకు దూరమైన నిహారిక.. తాజాగా డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చారు.
Also Read: Gold Rate Today: మహిళలకు బ్యాడ్‌న్యూస్.. పెరిగిన బంగారం ధరలు!