నిధి అగర్వాల్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి నాగచైతన్య నటించిన సవ్యసాచి అనే సినిమా ద్వారా మొదటిసారిగా హీరోయిన్ గా పరిచయమైంది.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా మెప్పించలేక పోయింది.కానీ నిధి నటన మరియు అందం తో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.. ఆ తర్వాత అక్కినేని అఖిల్ తో కలిసి మిస్టర్ మజ్ను అనే సినిమా ను చేసింది.ఆ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.నిధి అగర్వాల్ తన అందంతో అందరిని ఆకట్టుకుంది. ఆ తరువాత పూరి,రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా లో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచి నిధి అగర్వాల్ కు మంచి బ్రేక్ ఇచ్చింది.తర్వాత ఈ ముద్దుగుమ్మకు పలు చిత్రాలలో నటించే అవకాశం కూడా దక్కింది.
ఈ ముద్దుగుమ్మ అందాల నిధుల తో కుర్రకారును ఎప్పుడు తన వైపు తిప్పుకునేలా చేస్తూ ఉంటుంది. నిధి అగర్వాల్ తన అభిమానులను అందాలతో ఆకట్టుకుంటుంది.. ఇప్పుడు తాజాగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలోతెగ వైరల్ గా మారుతున్నాయి.. ఈ ఫోటోలను చూస్తే నిధి స్టన్నింగ్ లుక్ తో అదరగొట్టింది.ఒకవైపు చేతిలో రోజాతో రెడ్ కలర్ గాగ్రా డ్రెస్స్ లో క్యూట్ లుక్ లో మరింత అందంగా మెరిసింది.. ప్రస్తుతం ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ఇందులో ఈమె పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉన్నది.ఈ చిత్రం మీదే నిధి తన ఆశలన్నీ పెట్టుకున్నట్లు సమాచారం.. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు.. హరిహర వీరమల్లు సినిమా కనుక సక్సెస్ అయ్యిందంటే ఈ అమ్మడి కెరియర్ కు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అలాగే తమిళ సినిమాలలో కూడా ఆమె నటిస్తోంది. నిధి అగర్వాల్ లేటెస్ట్ హాట్ లుక్ తెగ వైరల్ అవుతుంది
