NTV Telugu Site icon

Nidhhi Agerwal : సోషల్ మీడియాలో వేధిస్తున్న వ్యక్తిపై కేసు పెట్టిన నిధి అగర్వాల్

Nidhi

Nidhi

సోషల్ మీడియాలో రోజు రోజుకి ఆకతాయిల వేధింపులు ఎక్కువవుతున్నాయి. టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఇటువంటి వేధింపులు ఎదురయ్యాయి. దాంతో సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్న వ్యక్తిపై సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేసింది హీరోయిన్ నిధి అగర్వాల్. సదరు వ్యక్తి తనను చంపేస్తానంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పంపిస్తున్నాడని కంప్లైంట్ లో పేర్కొంది నిధి అగర్వాల్. ఆ వ్యక్తి తనతో పాటు తనకు ఇష్టమైన వారిని, తన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలిపింది.

Also Read : Mohan Babu Case : సుప్రీం కోర్టులో మోహన్ బాబుకు స్వల్ప ఊరట.. కానీ..?

ఈ వ్యక్తి బెదిరింపుల వల్ల తాను మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నానని, సదరు నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిధి అగర్వాల్ తన ఫిర్యాదులో కోరింది. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు నిధి అగర్వాల్ కంప్లైంట్ తీసుకుని, విచారణ చేపట్టారు. కెరీర్ పరంగా నిధి అగర్వాల్ కు ఈ ఏడాది ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఆమె రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన రాజా సాబ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి హరి హర వీరమల్లు సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు త్వరలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. గతేడాది టాలీవుడ్ కు గ్యాప్ ఇచ్చిన నిధి ఈ  రెండు సినిమాలతో టాలీవుడ్ లో మళ్ళి బిజీ అవుతానని చెప్తూనే  సోషల్ మీడియాలోని అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిధి అగర్వాల్ సూచన చేస్తోంది.

Show comments