బ్యూటీఫుల్ గర్ల్ నిధి అగర్వాల్ 8 ఇయర్స్ నుండి ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నా రావాల్సినంత ఫేమ్, ఆఫర్స్ రాలేదు. గ్లామరస్ పాత్రలకు కూడా ఏ రోజు అడ్డు చెప్పలేదు కానీ లక్ కలిసి రాలేదు అమ్మడికి. 2017లో మున్నా మైఖెల్ అనే బాలీవుడ్ మూవీతో తెరంగేట్రం చేసిన నిధి. ఇప్పటి వరకు పట్టుమని పది సినిమాలు కంప్లీట్ చేయలేదు. ఈమె కన్నా వెనుక వచ్చిన భామలు దూసుకెళిపోతుంటే ఆమె మాత్రం ఎక్కడి వేసిన గొంగలి అన్నట్లుగా మారిపోయింది.
Also Read : Kiran Abbavaram : ఆ సినిమా చూడలేక థియేటర్ నుండి వెళ్లిపోయాను
బీటౌన్ ఎంట్రన్స్ ఓకే అనిపించినా ఆఫర్లు రాలేదు. దీంతో టాలీవుడ్ పై ఫోకస్ చేసింది. సవ్యసాచితో తెలుగు ఇండస్ట్రీ అడుగుపెట్టింది. అఖిల్ తో మిస్టర్ మజ్ను చేసినా రెండు ప్లాప్ అయ్యాయి. ఇక టీటౌన్ కు టాటా చెప్పద్దామనుకున్న టైంలో రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ తో సౌత్ బెల్ట్ పై ఆశలు నిలిపి ఉంచాయి. రెండేళ్ల తర్వాత హీరో మూవీ వచ్చినా మళ్లీ ఛాన్సుల కోసం వెతుక్కోవాల్సిన సిచ్చుయేషన్. ఆ టైంలో వచ్చిన ఆఫర్లే పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు, ప్రభాస్ రాజా సాబ్. అయితే తాను ఒకటి అనుకుంటే తాను నటిస్తోన్న సినిమాలు మరోటి డిసైడ్ చేస్తున్నాయి. బడా సినిమాలు చేతిలో ఉన్నాయి.. హమ్మయ్య ఈ సినిమాల్లో ఒక్కటి హిట్ సౌండ్ వస్తే కష్టాలు గట్టెక్కేస్తాయ్ అనుకుంటే రెండు కూడా అనుకున్న టైంకి థియేటర్లలోకి రాలేకపోతున్నాయి. హరి హర వీరమల్లు షూటింగ్ ఆలస్యం అనుకుంటే విడుదల కూడా లేట్ అవుతుంది. ఇందులో పంచమి అనే పవర్ ఫుల్ గర్ల్ రోల్ చేస్తోంది. ఎట్టకేలకు మార్చి 28న రిలీజ్ చేస్తారని మేకర్స్ ప్రకటించగా ఇప్పుడు ఆ డేట్ కు రావడం కష్టమేనని తెలుస్తోంది.