టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రభాస్ సరసన ‘ది రాజాసాబ్’, పవన్ కళ్యాణ్ తో ‘హరి హర వీరమల్లు’ మూవీలో నటిస్తోంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి ఈ రెండు చిత్రాల్లో నటిస్తున్నందు తాను ఎదుర్కొంటున్న సవాళ్లు గురించి పంచుకుంది.
నిధి మాట్లాడుతూ ‘ఫస్ట్ లాక్ డౌన్‌కు ముందే ‘హరిహర వీరమల్లు’ మూవీ కి సైన్ చేశాను. ఈ సినిమాకు దాదాపు మూడున్నర నుంచి నాలుగేళ్ల పట్టింది.పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు, కాబట్టి ఆయన షూటింగ్ కి డేట్స్ ఇచ్చినప్పుడే, నేను కూడా అందుబాటులో ఉండాలని ప్రొడక్షన్ టీం కోరింది. దీంతో విజయవాడలో ‘హరిహర వీరమల్లు’ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని సాయంత్రం వరకు ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ సెట్‌లో చేరడానికి, హైదరాబాద్ నుండి ఫ్లైట్ పట్టుకుని వెళ్ళేదాని. అది పూర్తవగానే వెంటనే, ఏ రాత్రి అయిన తిరిగి విజయవాడ కు రిటర్న్ అయ్యేదాని. దీంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. పడుకుంటే కాసేపు కారులోనే పడుకునేది. శారీరకంగా ఇబ్బంది ఉన్నప్పటికి పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో, పాన్ ఇండియా సినిమాల్లో ఒకేసారి నటిస్తునందుకు చాలా ఆనందంగా ఉంది. రాజాసాబ్, వీరమల్లు రెండూ వేటికవే భిన్నమైన సినిమాలు. ఈ రెండు ప్రాజెక్ట్ లతో 2025 సంవత్సరం నాకు బాగా కలిసొస్తుందని ఆశిస్తున్నాను’ అని పేర్కొంది అగర్వాల్ .ప్రస్తుతం ఈ అమ్మడు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.